డస్కీ బ్యూటీ హెబ్బా పటేల్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల దర్శక నిర్మాతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలిసినవాళ్ళు, బ్లాక్ అండ్ వైట్, అలా నిన్ను చేరి' తదితర చిత్రాలలో హెబ్బా పటేల్ నాయికగా నటిస్తోంది.
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘తెలిసినవాళ్ళు’. సిరంజి సినిమా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. నలభై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లోని అన్ని సన్నివేశాలూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగుతాయి. అయితే చివరిలో హెబ్బా పటేల్ చెప్పే ‘నన్ను నేను చంపుకోబోతున్నాను’ అనే డైలాగ్ వ్యూవర్స్ లో ఉత్సుకతను రేకెత్తింప చేస్తోంది. హీరో రామ్ కార్తీక్…