రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘తెలిసినవాళ్ళు’. సిరంజి సినిమా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. నలభై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లోని అన్ని సన్నివేశాలూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగుతాయి. అయితే చివరిలో హెబ్బా పటేల్ చెప్పే ‘నన్ను నేను చంపుకోబోతున్నాను’ అనే డైలాగ్ వ్యూవర్స్ లో ఉత్సుకతను రేకెత్తింప చేస్తోంది. హీరో రామ్ కార్తీక్ చెఫ్ గా నటించినట్టు దీనిని చూస్తే అర్థమౌతోంది. హెబ్బా పటేల్ కూడా గ్లామర్ డాల్ గా కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రను ఇందులో చేసినట్టు తెలుస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్.