సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యార్థికి కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సాయిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్న పేట గురుకుల పాఠశాలలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు…
* ఆసియా కప్: నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్ ఢీ.. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేటి నుంచి జరగాల్సిన నీట్-పీజీ కౌన్సెలింగ్ వాయిదా * కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం.. రేపు ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్ నివాళి.. మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష,…
సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బాధితులను పరామర్శించకుండా బీహార్…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వల్లనే నలుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు పాతవి కావడంతో ఈ తరహా చిక్కులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో 19 మంది మహిళలు, మరో పది మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం…
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమ 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు సృష్టించింది. ఇక ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని…
హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమయ్యింది. ఉదయం 6గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో 60 అడుగుల గాయత్రి, నూలు కండువా, గరికమాలతో రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా గుర్రపుబగ్గీలో తెలంగాణ సంస్కృతి కళారూపాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వినాయక ఊరేగింపులో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి కైరంకొండ సంతోష్ నేత ప్రారంభించి, ఉదయం 7గంటలకు స్వామి వారికి జంజంను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్…