Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
- ఫైనల్లో బెత్ మూనీ అద్భుత ప్రదర్శన
- 38 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్
- చరిత్ర సృష్టించిన బెత్ మూనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beth Mooney Creates History: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ బెత్ మూనీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 38 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మూనీ.. జట్టుకు ఏడో టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇన్నింగ్స్‌కు గాను ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్‌గా బెత్ మూనీ చరిత్రలో నిలిచింది.
తొలి మహిళా క్రికెటర్‌గా:
2023 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ప్రపంచకప్ ఫైనల్లో (2023, 2026) ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆసీస్ ప్లేయర్ అరుదైన రికార్డు నెలకొల్పింది. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ ఘనతను వెస్టిండీస్ మాజీ స్టార్ మార్లన్ శామ్యూల్స్ మాత్రమే సాధించాడు. అతడు 2012, 2016 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాకపోవడం విశేషం.
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ఒకేసారి రెండు అవార్డులు:
ఈ టోర్నమెంట్లో బెత్ మూనీ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు గెలిచిన రెండో క్రికెటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ అమెలియా కెర్ ఉంది. 2024లో ఆమె ఈ ఘనత అందుకుంది.
రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు:
అంతేకాదు మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్‌గా కూడా బెత్ మూనీ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2020 ప్రపంచకప్‌లో కూడా ఈ అవార్డు సొంతం చేసుకుంది. 2026లో మరోసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఈ రికార్డు భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు గెలిచాడు. ఇప్పుడు మహిళల క్రికెట్లో బెత్ మూనీ కూడా విరాట్ స్థాయిలో తన ముద్ర వేసి ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన టీ20 ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది.
టోర్నమెంట్లో 238 పరుగులు:
ఆస్ట్రేలియా మహిళల జట్టు ఇప్పటికే రికార్డు స్థాయిలో ఏడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోగా.. బెత్ మూనీ వ్యక్తిగతంగా నెలకొల్పిన ఈ అరుదైన రికార్డులు ఆమెను మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా నిలబెట్టాయి. ఆమె నిలకడైన ఆట, పెద్ద మ్యాచ్‌ల్లో రాణించే సామర్థ్యం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఫైనల్లో 64 పరుగులు చేసిన బెత్ మూనీ.. టోర్నమెంట్లో 238 పరుగులు బాదింది. ఆమె 47.60 సగటు, 142.51 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేసింది. టోర్నీలో మూడు అర్ధశతకాలను కూడా నమోదు చేసింది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!