KA PAUL Sensational Comments: తెలంగాణ రాజకీయాల్లో ఒక పేరు బాగా వైరల్ అయింది. అందునా మునుగోడు ఉప ఎన్నిక వేళ ప్రధాన పార్టీలకంటే అందరి ఫోకస్ ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ పైన పడింది. తానే గెలవబోతున్నానని, నాకు టైం లేదు .. నాకే ఓటేయండి అంటూ ఆయన చేసిన ప్రసంగాలు, విన్యాసాలు ఓటర్లనే కాదు యావత్ తెలుగురాష్ట్రాల ప్రజలకు వినోదం పంచింది.
అవతారాలు మారుస్తూ దశావతారం కమల్ హాసన్ ని మించిపోతూ.. ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆయన కడదాకా నిలబడ్డాడు.. ప్రచారం చేశాడు..వివిధ రూపాలలో విమర్శలు చేశాడు.. ఘాటైన విమర్శలు చేశాడు.. దాడులకు లోనయ్యాడు .తెలివిగా చమత్కార బాణాలు కూడా వేసాడు…చివరి వరకు లోడ్ చేసిన గన్ లాగా ధైర్యంగా వున్నాడు.. యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని పాల్ నిరూపించాడు. మునుగోడు ఉప ఎన్నికలో కేఏ పాల్ కి వచ్చిన ఓట్లు కేవలం 0.36 శాతం మాత్రమే. 804 ఓట్లు మాత్రం రాబట్టగలిగారు పాల్.
ఎన్నికల యుద్ధంలో గెలవకపోయినా ఫర్వాలేదు చివరి బాణం వరకూ వాడుతూనే వుండాలి. ఎక్కడ కూడా ఓడిపోతాను.. అనే ప్రస్తావన తీసుకు రాలేదు. సామాన్యుడు కూడా దైర్యం గా ఎన్నికలలో ప్రజాస్వామ్యంలో నిలబడ వచ్చు అనేకి అతను ఐకానిక్ సింబల్ కేఏ పాల్ అంటే అతిశయోక్తి కాదు. ధనం లేనిది ఓట్లు రావు అనేది ఓటమి తర్వాత గానీ ఆయను బోధపడలేదు.
Read Also: KA Paul Campaign: వారం రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యేను నేనే
ఊరికే ప్రజలను ఆకట్టు కొంటే ఓట్లు రావు అనే దానికి సింబలే. గతంలో ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవికి, ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ సభలకు కూడా జనం బాగానే వచ్చారు. కానీ వారంతా ఓటేయలేదు. ఇప్పుడు కేఏ పాల్ కూడా మూడంకెల ఓట్లకే పరిమితం అయ్యారు. జనాల దృష్టిలో ఉన్నంత మాత్రాన, నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన, నవ్విచ్చినంత మాత్రాన, తిరిగినంత మాత్రాన, ఓట్లాటలో గెలవలేము.. కొంత ఫాలోయింగు, ప్రజాకర్షణ ఉన్నంతమాత్రాన ప్రజాక్షేత్రంలో ఎన్నికల రణరంగంలో గెలవలేము…
ప్రజాశాంతి పార్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇబ్బందలు పెట్టిన ఇండిపెండెంట్ గా నిలబడి కాలికి బలపం కట్టుకొని ఊరు ఊరు తిరిగారు పాల్. .కష్ఠం అనేది పాల్ గారికి తెలిసి నట్లు ఉంది….రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం అందరికి సాధ్యం కాదు..ఎన్నికల్లో గెలవడం అంటే మద్యం ఏరులు పాలించ గలగాలి.. నోట్ల ప్రవాహం సెలయేరవ్వాలి. చుట్టూ మంది మార్బలం ఉండాలి .. దమ్ము ధైర్యం ఉండాలి .. మంచి వ్యూహం ఉండాలి ..వ్యూహకర్తలు, స్పాన్సర్లు ఉండాలి .. అన్ని విధాల సపోర్టు చేయగల గాడ్ ఫాదర్ లు ఉండాలని ఆయనకు తెలిసి వచ్చింది. తనకు 50 వేల మెజారిటీ గ్యారంటీ, తానే టాప్ అన్న పాల్ గారికి తత్వం బోధపడింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యానని, ఉప ఎన్నిక ఫలితాన్ని హైకోర్టులో సవాల్ చేస్తానంటున్నారు పాల్. ఏం జరుగుతుందో చూద్దాం మరి.
Read Also: Bandi Sanjay : ఎన్నికలకు మేము సిద్దం మీరు సిద్దమా.. బండి సంజయ్ సవాల్