తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు..…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిద్ధమవుతోంది… గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదలపై వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం నిర్వహించింది.. గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కింద 663 ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. దాదాపు 50 డిపార్ట్మెంట్లలో గ్రూప్-III సర్వీసెస్ రిక్రూట్మెంట్ కింద 1373 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో..…
కు.ని వికటించిన కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. 30 మంది మహిళలను హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈరోజు 11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపారు. చికిత్స పొందుతున్న 18 మందిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. బాధిత మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆపరేషన్స్ చేసిన వైద్య సిబ్బందిని విచారణ చేశామని అన్నారు. వసతులు,…
రాష్ట్రంలో సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారులు వరుసగా విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11.30 గంటలకు రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. www.bse.telangana.gov.in అనే సైట్లో…
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ మరోసారి పట్టుబడింది. డార్క్ వెబ్ ద్వారా కన్జూమర్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులు అదుపులో తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డార్క్ వెబ్ నెట్‌వర్క్‌ను హెచ్‌న్యూ టీమ్ రంగ ప్రవేశంతో బట్టబయలు చేశారు. పోలీసులకు చిక్కిన వారంతా ఉన్నత విద్యావంతులే…
ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.948.35 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్.. ప్రస్తుత 2022-23 అర్థిక సంవత్సరంలో ఆరు నెలలకు గాను అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ సంస్థలకు నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుధ్యం, పరిశుభ్రత అభివృధ్ది కోసం నిధులను విడుదల చేసినట్టు కేంద్ర సర్కార్…