తెలంగాణలో ఉత్కంఠరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యంపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇంకో వైపు మండిపడుతున్నాయి.. అయితే, మరో ముందడుగు వేసిన బీజేపీ నేతలు.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేయడం వివాదాస్పదంగా అయ్యింది.. ఈసీకి ఫోన్ చేసి బీజేపీ నేతలు ఎందుకు ఒత్తిడి తెస్తారని అంటూనే.. ఫలితాలు త్వరితగతిన ఒత్తిడి లేకుండా విడుదల చేయాలని అంటోంది టీఆర్ఎస్ పార్టీ.. అయితే.. ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కూడా ఫోన్ చేశారు..
Read Also: Komatireddy Raj Gopal Reddy: భయపడాల్సిన అవసరం లేదు.. అంతిమ విజయం మనదే
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు.. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను ఎన్నికల కమిషన్ అప్‌లోడ్ చేసినట్టుగా సమాచారం.. ఇక, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఈటల రాజేందర్… ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించారు.. పొరపాటు జరిగితే అది మీకే మచ్చ, మసక అని సూచించారు.. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ అంతా ఎన్నికల కమిషన్ మీద రాంగ్ ఒపీనియన్ వచ్చిందన్న ఆయన.. ఫలితాలు సక్రమంగా వెల్లడించండి. గెలుపు, ఓటములు సహజం.. కానీ, మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండి అని వికాస్ రాజ్ కి హితవు పలికారట ఈటల రాజేందర్.