* నేడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్.. 23 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు..
* 60వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం.. అల్లాదుర్గ్ లోని నైట్ హల్ట్ నుంచి జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్.. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కొనసాగనున్న భారత్ జోడో యాత్ర.. అల్లాదుర్గ్, కైదంపల్లి, రాంపూర్, నిజాంపేట్, నారాయణఖేడ్, మహాదేవ్ పల్లి మీదుగా కొనసాగనున్న రాహుల్ పాద యాత్ర
* నేడు ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు
* నేటితో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు
* బాపట్ల : వేటపాలెం బండ్ల బాపయ్య కళాశాల శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు కార్యక్రమాలకు హాజరుకానున్న సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ..
* తిరుమల: టీటీడీ డిఫాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేసిన అధికారులు.. కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాల కాలంలో ఆదాయం తగ్గినా.. పెరిగిన డిపాజిట్లు.. 19 బ్యాంకులో రూ.15,938 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసిన టీటీడీ
* గుంటూరు: నేడు తపాలా, విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమం..
* గుంటూరు : నేడు, రేపు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోనీ కేఎల్ యూనివర్సిటీ లో బాలోత్సవం …
* పల్నాడు జిల్లా: నేడు అమరావతి మండలం నిడుముక్కలలో హజ్రత్ దర్గా 70వ ఉరుసు మహోత్సవం…
* బాపట్ల: రేపు చెరుకుపల్లి మండలం గూడవల్లి లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా…
* ఈనెల 11న గుంటూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్.
* విశాఖ: సాగర్ నగర్ తీరంలో బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్…. 7వ విడత సాగర స్వచ్ఛతలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు.