డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా భావిస్తున్న షియోమీ 18 సిరీస్‌పై అనేక లీకులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన మరికొన్ని కీలక వివరాలు మరోసారి ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే విభాగాల్లో భారీ అప్గ్రేడ్లతో మార్కెట్లోకి రానుంది.
లీక్ వివరాల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లాట్ డిస్ప్లే ఉండనుంది. నాలుగు వైపులా సమానంగా సన్నని బెజెల్స్, పెద్ద రౌండెడ్ కార్నర్స్‌తో ప్రీమియం డిజైన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్లో 6.9 అంగుళాల 2K OLED డిస్ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు కెమెరా విభాగం ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో LOFIC (Lateral Overflow Integration Capacitor) టెక్నాలజీతో కూడిన 200MP ప్రధాన కెమెరా అందించే అవకాశముంది. అంతేకాకుండా, మరో 200MP టెలిఫోటో కెమెరాను కూడా ఈ ఫోన్లో అందించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఈ టెలిఫోటో సెన్సార్ మాక్రో ఫోటోగ్రఫీకి మద్దతు ఇవ్వడంతో పాటు సుమారు 3X ఆప్టికల్ జూమ్‌ను అందించవచ్చని సమాచారం. కెమెరా ట్యూనింగ్ కోసం షియోమీ లైకాతో కలిసి పనిచేసే అవకాశముంది.
Also Read
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
బ్యాటరీ విషయానికి వస్తే.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో 8,000mAh కంటే ఎక్కువ సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీ ఉండొచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు. గత లీక్‌ల ప్రకారం ఈ ఫోన్లో 8,500mAh బ్యాటరీని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న లీకుల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌ను ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో షియోమీ 18, షియోమీ 18 ప్రో మోడళ్లతో పాటు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?