Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
- మరోసారి చర్చనీయాంశంగా పృథ్వీ షా వ్యక్తిగత జీవితం
- నెట్టింట వైరల్ అవుతోన్న అకృతి ఇన్‌స్టా పోస్ట్
- చాలాసార్లు మోసపోయా, ప్రతి రూమర్ నిజమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw’s Fiancee Akriti Agarwal Alleged Cryptic Post Viral: భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ షాకు కాబోయే భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాను చాలాసార్లు మోసపోయా అని, కానీ ఒక్క మాట కూడా అనలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలోని ప్రతి రూమర్ నిజమే అంటూ అకృతి రాసుకొచ్చారు. అయితే అకృతి చేసిన పోస్టులలో ఎక్కడా పృథ్వీ షా పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు షాను ఉద్దేశించే చేసినవని సోషల్ మీడియాలో అభిమానులు చర్చిస్తున్నారు.
ప్రతి రూమర్ నిజమే:
‘నన్ను చాలా సార్లు మోసం చేశారు. అయినా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడితో జీవితంలో ముందడుగు వేసిన తర్వాత ఇలా జరుగుతుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని అకృతి అగర్వాల్ ఓ పోస్టులో పేర్కొంది. మరో పోస్టులో ‘అన్నీ నిజమే. అతడి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి రూమర్ వాస్తవం’ అని రాసుకొచ్చింది. అయితే ఈ రేండు పోస్టులు ప్రస్తుతం అకృతి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అకృతి:
ఈ పోస్టులు నెట్టింట వైరల్ అయినప్పటికీ.. పృథ్వీ షా లేదా అకృతి అగర్వాల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అలాగే అకృతి ఇప్పటికీ పృథ్వీ షాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండగా.. ఇద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్నాయి. దీంతో ఈ ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది. పృథ్వీ, అకృతి ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అకృతి ఒక నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందింది.
సాఫీగా సాగని క్రికెట్ కెరీర్:
మరోవైపు పృథ్వీ షా క్రికెట్ కెరీర్ గత కొంతకాలంగా సాఫీగా సాగడం లేదు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికీ అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఫిట్నెస్ సమస్యలు, పేలవమైన ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు కూడా ఎప్పుడో దూరమయ్యాడు. అయితే ఇటీవల తన పునరాగమనంపై ఆశావహంగా స్పందించిన పృథ్వీ షా.. భారత్ తరఫున మళ్లీ ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ‘భారత్‌కు తిరిగి ఆడాలని ఆలోచించకపోతే నేను క్రికెట్ ఎందుకు ఆడుతాను?. గత ఏడాది కొంత విరామం తీసుకుని మానసికంగా బలంగా మారాను. ఇప్పుడు సాధనను మూడు రెట్లు పెంచాను. ఈ విరామం వెనకడుగు కాదు.. మరింత బలంగా తిరిగి రావడానికి సరైన సమయం’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..