Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
- టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్ ఓటమి
- నిరాశ వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్
- ఫైనల్ ఓటమి చాలా బాధగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Captain Nat Sciver-Brunt Crying: ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఈ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడినప్పటికీ.. ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయామని అంగీకరించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా తమ అనుభవాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందని, ఒత్తిడి పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్టు మరింత మెరుగ్గా ఆడిందని ప్రశంసించింది. టోర్నీ ఆసాంతం బాగా ఆడడం, సొంత మైదానం కావడంతో ఫైనల్ ముందు ప్రపంచకప్ తమదే అనుకున్నాం అని.. కానీ ఫైనల్లో తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాం అని నాట్ స్కివర్ పేర్కొంది. ఫైనల్ ఓటమి అనంతరం ఆమె మైదానంలోనే బోరున ఏడ్చింది.
మ్యాచ్ అనంతరం నాట్ స్కివర్-బ్రంట్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా బాధగా ఉంది. టోర్నమెంట్ మొత్తం మేము అద్భుతమైన క్రికెట్ ఆడాం. కానీ ఫైనల్ ఇలా ముగియడం చాలా నిరాశ కలిగిస్తోంది. ఈరోజు ఆస్ట్రేలియా బాగా ఆడింది. పెద్ద మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలో వారికి తెలుసు. ఆసీస్ తమ అనుభవాన్ని ఉపయోగించుకుంది’ అని తెలిపింది. టాస్ గురించి స్పందించిన నాట్ స్కివర్.. ‘నిజం చెప్పాలంటే నేను కొద్దిసేపు బయటకు వెళ్లాను. ఎందుకంటే నాకు అత్యవసరంగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది’ అంటూ నవ్వులు పూయించింది. అనంతరం మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘టాస్ గెలిచి ఉంటే మేమే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. ఈ పిచ్‌పై 150 పరుగులు సరిపోవని మాకు కూడా తెలుసు. బ్యాటింగ్ సమయంలో ఆరంభం నుంచి లయ దొరకలేదు. ఒత్తిడి పెరిగినప్పుడు ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి మాకు పరుగులు చేయనివ్వలేదు’ అని వివరించింది.
Also Read
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
- Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
ఆస్ట్రేలియా ఛేదనలో మొదటి నుంచే దూకుడుగా ఆడుతుందని తాము ముందే ఊహించామని స్కివర్-బ్రంట్ చెప్పింది. ‘ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలుసు. రెండు వికెట్లు తీసినా ఎలీస్ పెర్రీలాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్ ఉంది. అందుకే వరుసగా వికెట్లు తీయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మేము ఆ పని చేయలేకపోయాం. బెత్ మూనీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పేసింది’ అంటూ ప్రశంసించింది. ‘ఈ టోర్నమెంట్‌కు ముందు మేము చాలా కష్టపడ్డాం. జట్టులో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ హీరోగా నిలిచింది. మేమంతా ఒక కుటుంబంలా కలిసి ఆడాం. ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించాం. ఇంగ్లండ్ జెర్సీ ధరించడం మాకు గర్వకారణం. ఈ ఓటమి బాధాకరమే అయినా.. దీని నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేసింది.
స్వదేశ అభిమానుల మద్దతుపై మాటాడుతూ స్కివర్-బ్రంట్ భావోద్వేగానికి గురైంది. ‘మా దేశం కోసం ఆడటం గొప్ప గౌరవం. విజయాల సమయంలోనే కాదు.. అపజయాలు వచ్చినా మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారి మద్దతు మాకు ఎంతో విలువైనది’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. నాట్ స్కివర్ 58 పరుగులు చేయగా, ఫ్రేయా కెంప్ 44 పరుగులతో రాణించింది. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బెత్ మూనీ (64), ఫోబీ లిచ్‌ఫీల్డ్ (48) అద్భుత ఇన్నింగ్స్‌లతో 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఏడోసారి విశ్వవిజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!