మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అధికార, ప్రతిపక్షాలు.. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడంపై టీఆర్ఎస్ మండిపడుతోంది.. బీజేపీ నేతల తీరును తప్పుబడుతూనే.. అసలు ఫలితాల వెల్లడిలో ఎందుకు ఈ జాప్యం..? ముందు ఇచ్చే లీక్‌లు ఏంటి.. ఆ తర్వాత వచ్చే ఫలితాలు మరోలా ఉండడమేంటి? అని మంత్రి జగదీష్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.. అయితే, మునుగోడు ఫలితాల వెల్లడిలో అసలు జాప్యానికి కారణం ఏంటి? అనేది వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్… 4- 5 రౌండ్లు మధ్య 20 నిమిషాల ఆలస్యం జరిగిందన్న ఆయన.. అందరి సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.. కానీ, ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో ఫలితాల వెల్లడిలో లేట్ అవుతుందన్నారు.
Read Also: By elections: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం.. 4 స్థానాలు కైవసం చేసుకునే దిశగా..
పొలిటికల్ ప్రతినిధులు, అబ్జర్వర్లు, ఆర్‌వో అందరూ ఒకే అన్న తర్వాత ఫలితాలు వెల్లడిస్తున్నారని తెలిపారు వికాస్ రాజ్.. చాలా పారదర్శకంగా కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక్కో రౌండ్ కి అర గంట టైం పడుతుంది.. వేరే రాష్ట్రాలల్లో అభ్యర్థులు ఐదు, ఆరుగురు మాత్రమే ఉన్నారని.. మన దగ్గర 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.. అయితే, అందరివీ ఎంట్రీ చేయాలి అంటే టైం పడుతుందని వెల్లడించారు.. ఎలాంటి టెన్షన్ లేదు.. సాఫీగానే కౌంటింగ్ సాగుతోందన్నారు. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడమే అసలు జాప్యానికి కారణం.. పారదర్శకంగా ఫలితాలు వెల్లడిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.