మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం, బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోపణల నేపథ్యంలో… గద్వాల్ అడిషనల్ ఎస్పీపై వేటు వేసింది తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని కలిసినట్లుగా అభియోగాల నేపథ్యంలో.. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌పై వేటు వేసిన ఉన్నతాధికారులు.. రాములు నాయక్‌ని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుండి సెలవులో వెళ్లిన రాములు నాయక్… సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ లోకల్ లీడర్లతో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో.. సమగ్ర విచారణ జరిపిన లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్… బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాములు నాయక్ కలిసినట్లు విచారణలో వెల్లడైంది.. దీంతో.. డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలంటూ గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
Read Also: TRS Leders: ఇంకో ఐదు రౌండ్లు అయ్యే వరకు బీజేపీ లీడర్లు ఓపిక పట్టండి..