ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా సంచలనంగా మారుతుంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హడావుడి చేస్తూ.. నవ్వులు పూయించిన ఆయన.. ఇప్పుడు.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.. ఇక్కడ కూడా.. తగ్గేదే లే అనే తరహాలో రెచ్చిపోతున్నారు పాల్.. మునుగోడులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ తనను ఆపిన అధికారుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్…
సర్టిఫికెట్ల కేసులో జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి నల్గొండ పోలీసుల సోదాలు నిర్వహించారు. పట్టణంలోని స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు చేశారు. పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది… పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ.. విమర్శలు, ఆరోపణల పర్వం ఓవైపు.. ప్రచారం, లీక్‌ల పర్వం మరోవైపు సాగుతోంది.. నిన్నటికి నిన్న.. పార్టీని చూడకుండా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి వైరల్‌గా మారిపోయింది… చావు, బతు, చెడు, మంచి, పెళ్లి, పిల్లలు.. ఇలా అన్నింటికీ తన సోదరుడు సాయం చేస్తూ…
* టీ 20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ * టీ 20 వరల్డ్ కప్‌లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ * టీ20 వరల్డ్ కప్‌లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. 30న సాయంత్రం 4.30…
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది… అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఓవైపు, జంపింగ్‌లు మరోవైపు.. బంధుత్వాలో ఇంకోవైపు.. ఈ ఎన్నికను ఆసక్తికరంగా మారుస్తున్నాయి.. తాజాగా టి.పీసీసీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రంగంలోకి దిగారు.. ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడిన ఓ ఆడియో లీక్ కలకలం రేపుతోంది… తమ్ముడి తరపున ప్రచారం చేస్తున్న వెంకట్‌రెడ్డి… కాంగ్రెస్ శ్రేణులకు ఫోన్ చేసి దొరికిపోయారు.. ఆ ఆడియోలో బీజేపీ…
ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఢిల్లీ వెళ్లి బీజేపీ గూటికి చేరిన సీనియర్ రాజకీయ నేత దాసోజు శ్రవణ్ కుమార్.. ఇప్పుడు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు.. అసలు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో కమలం పార్టీ నేతలు ఉండగా.. బీజేపీకి రాజీనామా చేశారు దాసోజు.. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపిన ఆయన.. ఇవాళ సాయంత్రం.. టీఆర్ఎస్ వర్కింగ్…
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజా స్వామ్యం ఎంత బలంగా ఉందొ అనేది ఖర్గే ఎన్నిక నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు అధ్యక్షుడు కావడం గర్వ కారణమని అన్నారు.