KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా సంచలనంగా మారుతుంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హడావుడి చేస్తూ.. నవ్వులు పూయించిన ఆయన.. ఇప్పుడు.. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.. ఇక్కడ కూడా.. తగ్గేదే లే అనే తరహాలో రెచ్చిపోతున్నారు పాల్.. మునుగోడులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ తనను ఆపిన అధికారుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ అంటూ.. విధుల్లో ఉన్న ఓ అధికారిపై తన ప్రతాపం చూపాడు. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు.
Read Also: MLA Raghunandan Rao: నాపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా..
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
అయితే, కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచార నిర్వహిస్తుండగా, వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్‌కు కోపం వచ్చింది.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నా అన్నారు.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని.. రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారిని నీ పేరు ఎంటంటూ అధికారి మెడలోని ఐడీ కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. సదరు అధికారితో పాటు.. కేఏ పాల్‌కు సర్ది చెప్పడంతో కాస్త శాంతించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఉప ఎన్నికలో తనను గెలిపిస్తే.. మునుగోడును అమెరికా చేసేద్దాం అంటూ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.. ఏ పార్టీ వల్ల కాని అభివృద్ధి చేసి చూపిస్తాం.. ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు కేఏ పాల్.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!