సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8.50 గంటల నుంచి 26 గంటల వరకు ఆలయంలోకి ప్రవేశం ఉండదని ప్రకటించారు.
క్రికెట్ బెట్టింగ్ అంతా గుట్టుగా సాగిపోతుంటుంది.. గుట్టు చప్పుడు కాకుండా.. వందలు, వేలు, లక్షలు.. ఇలా వారికి స్టేటస్‌ను బట్టి బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.. పోలీసులు నిఘా పెట్టినా.. ఎంతో మందిని అరెస్ట్ చేసినా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది.. బూర్గంపాడు మండలంలో క్రికెట్ కేంద్రంగా రెచ్చిపోయింది బెట్టింగ్ గ్యాంగ్.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.. ఈ ఘటనలో ఇద్దరు…
మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈనెల ఆయన బుధవారం 26న బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారు. అయితే అదేరోజు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
నాన్ వెజ్ ప్రియులకు బంపరాఫర్ ప్రకటించాడు ఓ షాపు యజమాని.. మీరు.. ఒకేసారి మటన్, చికెన్ రెండూ తినాలి అనుకుంటే.. కేవలం మటన్ కొంటే సరిపోతుంది.. ఎందుకంటే.. మటన్ కొనుగోలుపై చికెన్ ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చాడు.. ఆ యజమాని.. ఇదేదో ఒక్కరోజుకే పరిమితమైన ఆఫర్ కాదు.. కానీ శనివారం మరియు సోమవారం షాపుకు సెలవు అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.. మొత్తంగా నాన్‌వెజ్ వ్యవహారం కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కొందరు ప్రశంసలు…
తెలంగాణను చలి వణికిస్తోంది..కేరళ రాష్ట్రంలో గత జూన్ 1న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణ సహా దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు ఉదయం 9.30 గంటలకు బంగ్లాదేశ్‌తో నెదర్లాండ్స్ మ్యాచ్.. * టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సౌతాఫ్రికాతో జింబాబ్వే ఢీ.. * దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రేక్.. ఢిల్లీకి వెళ్లిన రాహుల్ * ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలులో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు.. * ఒంగోలు కేశవస్వామిపేట చెన్నకేశవ…
What’s Today: * టీ20 ప్రపంచకప్: నేడు హోబర్ట్ వేదికగా శ్రీలంక-ఐర్లాండ్ ఢీ, ఉదయం 9:30 గంటలకు మ్యాచ్.. మెల్బోర్న్ వేదికగా భారత్-పాకిస్థాన్ ఢీ, మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ * నేడు తెలంగాణలోకి ప్రవేశించనున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర.. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రాహుల్‌కు స్వాగతం పలకనున్న కాంగ్రెస్ శ్రేణులు.. తొలిరోజు 3.9 కిలోమీటర్ల మేర సాగనున్న రాహుల్ పాదయాత్ర *…