మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ గా మారింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ఎవరి పరం కానుంది? మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానా? కాంగ్రెస్ జెండానా? లేదంటే బీజేపీ కమలమా? మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ ను భయపెడుతోందా? మంత్రి కేటీఆర్ అక్కడే వుండి అన్నీ చక్కబెడుతున్నారు. ఎన్టీవీతో మంత్రి కేటీఆర్ Exclusive ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ లైవ్ షోలో అనేక అంశాలు ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. బీజేపీపై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికలంటే మాకు భయం లేదు.. ఎన్నికలు, ఉప ఎన్నికలంటే మాకు భయం లేదు. సీఎం కేసీఆర్ పై నమ్మకంతో మాకు మునుగోడు ప్రజలు ఓటేస్తారు. ఏ ఎన్నిక వచ్చినా మా ఎమ్మెల్యేలు, మంత్రులంతా అక్కడ వున్నారు. మేం ఎన్నికలంటే భయపడడం లేదు. గుజరాత్ లో లక్ష కోట్లు అక్కడ పథకాలు ప్రకటించింది. మునుగోడులో మాతో పాటు కేంద్రమంత్రులు వస్తున్నారు. బయటవారు వచ్చి తెలంగాణ మీద దండయాత్ర చేస్తుంటే.. మేం ఏం చేయకూడదా? మేం ఎన్నో చేశాం.. మునుగోడులో కేసీఆర్ ని ఓడిస్తాం.. కేసీఆర్ కి ఘోరీ కడతాం అని నెగిటివ్ కాంపైన్ చేస్తున్నారు బీజేపీ నేతలు.
Read Also: Talasani Srinivas Yadav : కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారానికి మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు
మేం చేసిన పని చెప్పుకోవాలి.. మునుగోడులో అనేక పథకాల ద్వారా ప్రయోజనాలు అందిస్తున్నాం. ఆ విషయాలు మేం చెబుతున్నాం. దేశంలో అనేక మతాలు, కులాల వారు వున్నారు. సంక్షేమం, పరమత సహనం నమ్ముతున్నాం. పనిచేయకుండా వారు విమర్శలు చేస్తున్నారు. మతం మత్తులాంటిదన్నారు. దేశం బాగుండాలని భావించేవారు, దేశం పట్ల ప్రేమ వున్నవారు ఆలోచించాలి. కరెంట్ లేని ఊళ్ళు అనేకం వున్నాయి. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యాక ఆమె ఊరికి కరెంట్ వచ్చింది. వందల ఏళ్ళ గ్రామాలు నీరు లేక అల్లాడిపోతున్నాయి. ఏ గ్రామానికి నీరు ఇద్దాం అని మేం ఆలోచిస్తుంటే.. మతం గురించి వారు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఆవేశాలు పాలపొంగులాంటివి అన్నారు మంత్రి కేటీఆర్.
దేశంలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చారు. దేశంలో రెండవసారి అధికారంలో వచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న కంపెనీలు మూతబడ్డాయి. స్విస్ బ్యాంకులో నల్లధనం డబుల్ అయింది. దేశ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు. అయినా జనం బీజేపీని నమ్ముతున్నారు. 8 ఏళ్లలో మోడీ సాధించింది ఏంటంటే.. 400 వున్న గ్యాస్ సిలిండర్ ధర 1100 అయింది. పెట్రోల్ ధర 120 అయింది. తెలంగాణలో కేసీఆర్ ట్యాక్స్ లు పెంచలేదు. మోడీయే పెంచారు. దేశంలో రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది. నిజాం, ఇస్లాం, పాకిస్తాన్, ఓవైసీ అనే పదాలే బీజేపీ వినిపిస్తోంది.
తెలంగాణలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వం నడిపేవారు మానవ మాత్రులే. పొరపాట్లను మేం సవరించుకుంటున్నాం. మేం ఏ పార్టీని చీల్చలేదు. మిషన్ భగీరథ కు 19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ అడిగితే తెలంగాణకు డబ్బులు ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డికి 18వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక వ్యక్తికి అంత కాంట్రాక్ట్ ఇవ్వడం సరైంది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాలకు పనిచేస్తున్నారు.
ఒక వ్యక్తి సంపద పెరిగితే.. దేశం బాగుపడుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అదానీ ఎందుకంత సంపన్నుడయ్యాడు. ఎవరో ఒకరు బాగుపడితే అంతా బాగుందని బీజేపీ వాళ్ళు భావిస్తారు. 11 లక్షల 50 వేల కోట్లు కార్పోరేట్ రుణాలు మాఫీ చేస్తారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే కుదరదంటారు. మేమివ్వాలంటే అది తాయిలం, బడా బాబులకు లక్షల కోట్లు ఇస్తే అది ప్రోత్సాహం అంటారు. ఎన్నివేల కోట్లు ఇచ్చైనా జనాన్ని కొనుగోలు చేస్తారు. తమ కార్యకర్తల మీద దాడులు చేయించుకుని మేమే చేస్తామంటారు. సానుభూతి కోసం ఏదైనా చేస్తారన్నారు మంత్రి కేటీఆర్.
అవినీతి ఉండకూడదంటారు మోడీ. కానీ కర్నాటకలో ఎడ్యుకేషన్, కాంట్రాక్టర్లు మోడీకి లేఖ రాశారు. 40 శాతం కమిషన్ అడుగుతున్నారన్నారు. దేశంలో అవినీతి రాష్ట్రం ఏదైనా వుందంటే అది కర్నాటక. 2500 కోట్లు ఇస్తే ఓ ఎమ్మెల్యేని సీఎంని చేస్తామన్నారు. సత్య హరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారు. బీజేపీలో వారసత్వం వుంది. మోడీగారికి కుటుంబం వుంది. కేబినెట్ మంత్రులంతా వారసులే. జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అమిత్ షా వంటి వారి వారసులు చక్రం తిప్పుతున్నారు. మేం ఇచ్చిన అఫిడవిట్ చూడాలి. ఎంక్వయిరీ చేయించుకోవాలి. మా అఫిడవిట్లో లేని ఆస్తులుంటే మీరే స్వాధీనం చేసుకోవాలి. ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్పాం. మేం చెప్పమంటే గంట చెబుతా. మాకు ఓటేస్తే ఇంకా చేస్తామంటాం. కేంద్రంలో మేం మునుగోడుకి ఏం చేశారో చెప్పాలి. విషం చిమ్మడమే తప్ప బీజేపీకి చేసిందేం లేదు. కేసీఆర్ ఫాం హౌస్ లో పడుకుంటారంటున్నారు. ఎంత సేపు పడుకుంటారనేది కాదు.. దేశానికి ఎవరేం చేశారు. పేదలకు ఏం చేశారో చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్.
మేం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మామీద ఎన్నో అనుమానాలు వున్నాయి. మేం ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోలేదు. కొత్త రాష్ట్రం పునాది గట్టిగా వుండాలి. కేంద్రం హామీలు నిలబెట్టుకోలేదు. బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఏపీ-తెలంగాణ మధ్య ఇబ్బందులు తప్పించలేదు. నీటి పంపకాలు తేల్చరు. మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకి వెళితే… కుదరదని విత్ డ్రా చేసుకోమన్నారు. చేశాం.. కానీ ఏడాది అయినా నీటి సమస్య తీరలేదు. తెలంగాణ పథకాలను ప్రశంసించరు. మా మీద కక్ష జనం మీద చూపిస్తున్నారు.
తెలంగాణ సొమ్ములతో దేశంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి చేస్తున్నారు. మాకు క్రెడిట్ ఇస్తారా? హుజూరాబాద్ లో గెలుపు బీజేపీది కాదు… ఈటల మీద సానుభూతి మాత్రమే. మునుగోడులో మూడవ స్థానం బీజేపీది. సంస్థాగత నిర్మాణం, బలం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప బీజేపీకి అంత సీన్ లేదు. రాజగోపాల్ రెడ్డి తులం బంగారం ఇస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పండి.
వందల వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది బీజేపీ. మేం కోట్లు ఇవ్వడం లేదు. రాజకీయాల్లో ఎన్నిక అనేది మేం కూడా ధీటుగా పోరాడతాం. మేం గడపగడపకు వెళ్ళి ఏ వర్గానికి మేం ఏం చేశామో చెబుతున్నాం. మామీద కులం ముద్ర లేదు. కేసీఆర్ అన్నివర్గాల ప్రజలు ఓటేస్తేనే గెలిచారు. పార్టీలో చేరేది స్వచ్ఛందమా? బలవంతమా అంటే అలాంటిదేం లేదన్నారు. మా పార్టీలో టికెట్ల కోసం ఎంతో పోటీ వుంది. మా అభ్యర్థి గురించి అదే ప్రచారం సాగుతోంది. పార్టీ మీద ప్రేమ, కేసీఆర్ పై అభిమానం ముఖ్యం.
14 నెలల కాలంలో అక్కడ అభివృద్ధి చూపించాలి. రాబోయే రోజుల్లో మునుగోడులో ఏం చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి అనేది మేం ఆలోచిస్తాం. విపక్ష ఎమ్మెల్యేలున్నా అక్కడ అభివృద్ధి చేశాం. రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడం అంటే మూకుమ్మడిగా కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంటుంది. మోడీ జన్ కీ బాత్ వినరు.. ఆయన మన్ కీ బాత్ వినాలంటారు. ఏ పథకాలు కోవిడ్ సంక్షోభంలో ఆగలేదు. పేదప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. కోవిడ్ సమయంలో అందరికీ సాయం చేశాం. ఏమీ ఇవ్వని మోడీకి ఓటేయాలంటారు.. అన్నీ ఇచ్చిన కేసీఆర్ కి ఎందుకు ఓటేయకూడదు. ఓటర్లు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్.