Betting Mafia attack: రెచ్చిపోయిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ బెట్టింగ్ అంతా గుట్టుగా సాగిపోతుంటుంది.. గుట్టు చప్పుడు కాకుండా.. వందలు, వేలు, లక్షలు.. ఇలా వారికి స్టేటస్‌ను బట్టి బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.. పోలీసులు నిఘా పెట్టినా.. ఎంతో మందిని అరెస్ట్ చేసినా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది.. బూర్గంపాడు మండలంలో క్రికెట్ కేంద్రంగా రెచ్చిపోయింది బెట్టింగ్ గ్యాంగ్.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా.. వారికి ఆస్పత్రిలో చేర్చారు స్థానికులు.. ఇక, ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
Read Also: No Diwali: దీపావళి అంటేనే భయం.. వేడుకలపై బ్యాన్.. ఎక్కడ..? ఎందుకంటే..?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా వ్యహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది, క్రికెట్ ఆటని అడ్డగా చేసుకొని బెట్టింగ్ కు పాల్పడిన ఇరువర్గాలలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసిన ఘటన బూర్గంపాడు మండలం తాళ్ల గోమ్మూరులో చోటుచేసుకుంది.. బూర్గంపాడు మండలం తాళ్ల గొమ్మురులో ఆదివారం జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ వివాదానికి కారణమైంది, క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ పాల్పడిన వారు డబ్బులు చెల్లించకపోవడంతో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, డబ్బులు చెల్లించకపోవడంతో బెట్టింగ్ కు పాల్పడిన వారి ఇంట్లోకి చొరబడి మరి దాడి చేయడం సంచలనం సృష్టిస్తుంది, కొంతమంది యువకులు సినీ పక్కిలో చేసిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.. ఈ దాడిలో తాళ్ల గోమ్మూరుకు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!