Telangana temperature: తెలంగాణ వాసులు అలర్ట్.. ప్రారంభమైన చలి ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana temperature: తెలంగాణను చలి వణికిస్తోంది..కేరళ రాష్ట్రంలో గత జూన్ 1న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణ సహా దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, మరోవైపు రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. దీని ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి ఇది బంగ్లాదేశ్‌లోని తింకోన, శాండ్విప్ మధ్య ఈ నెల 25వ తేదీ ఉదయం తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణపై ఏమీ లేదు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. శీతాకాలం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) తన వాతావరణ సూచనలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో 15 నుండి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేసింది.
Read also: Nagababu : ఓహో ఇప్పుడు జనసేన మీద మరోసారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధం
Also Read
హైదరాబాద్ నగరంలో 16 నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత 24 గంటల్లో సంగారెడ్డిలోని న్యాల్‌కల్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 13.1C నమోదైంది. వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్‌లలో 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో సంగారెడ్డి జిల్లాలోని న్యాకల్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత (13.1C) నమోదైంది మరియు GHMC పరిధిలో రాజేంద్రనగర్ ARS 15 C వద్ద నమోదైంది. అక్టోబరు 22 నుంచి 25 వరకు నగరంలో అసాధారణమైన చలి వాతావరణం కనిపిస్తుందని తెలంగాణ వాతావరణ అధికారి టి. బాలాజీ అక్టోబర్ 20న తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, పొడిగాలులు తెలంగాణలోకి వీయడమే ఇందుకు కారణమని చెప్పారు. ఆదివారం ఉదయం అత్యల్పంగా న్యాల్‌కల్(సంగారెడ్డి జిల్లా)లో 13.1, హైదరాబాద్‌లో 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
Anudeep : షారూఖ్‌తో చేయాలని ఉంది.. ‘జాతిరత్నం’ మనసులో మాట
- Tags
- GHMC
- telangana
- temperature
- tsdps
- weather
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?