తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతోంది. అన్నిపార్టీలు మునుగోడులోనే తిష్టవేశాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. అధికార పార్టీ నేతలంతా అక్కడే వుండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఎన్నికలు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. అభివృద్ధి కోసం రాజీనామా చేసి బీజేపీలో చేరానని చెప్పుకుంటున్న రాజగోపాల్ రెడ్డి ని కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ఓటర్లు ను టార్గెట్ గా చేసుకున్న బీజేపీ వారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రచారం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.. అడుగడుగునా కాంగ్రెస్ మాత్రం రాజగోపాల్ రెడ్డి ప్రచారం అడ్డుకుంటుంది. నియోజకవర్గం లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీల మధ్య హోరాహోరి సాగుతుంది .తాజాగా నువ్వా నేనా అన్నట్లుగా ఆ రెండు పార్టీల మధ్యనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ల మధ్యనే వివాదం తార స్థాయి కి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుంటుంది. కోమటిరెడ్డి కుటుంబం అంతా కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పక్కనే చేరింది. కోమటిరెడ్డి కుటుంబమంతా రాజగోపాల్ రెడ్డి పక్కన చేరింది. తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇస్తానని పరోక్షంగా చెప్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ ను వీడి రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి పోటీ చేస్తుండగా, రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ ఎం పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొంతమందికి కాల్ చేసి చెప్తున్న ఆడియో క్లిప్పుల సైతం బయటపడ్డ విషయం తెలిసిందే.
అయితే రాజగోపాల్ రెడ్డి ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మాత్రమే అని అందరూ భావిస్తున్నారు. ఇక్కడ బిజెపి కి ఏ మాత్రం బలం లేదు కూడా.. అటువంటి చోట ఇప్పుడు బిజెపి మునుగోడు లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక్క ప్రయోగాన్ని రాజగోపాల్ రెడ్డి తో చేస్తోందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాజగోపాల్ రెడ్డితో టచ్ లో వున్నారు. దీంతో కాంగ్రెస్ ఓట్లని కొల్లగొట్టడం కోసం బిజెపి అహర్నిశలు ప్రయత్నం చేస్తుంది. రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకులందరినీ బిజెపిలో చేర్పించే కార్యక్రమం మొదటి నుంచి చేశాడు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ మూడవ స్థానానికి పడిపోతుందన్న ప్రచారం ఉంది.
Read Also: India World Record: పాక్‌పై విజయంతో.. ఆ వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టిన భారత్
హుజూరాబాద్ సీన్ మునుగోడులో రిపీట్ అవుతుందేమో అన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలంతా కూడా చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. తమ ఓటు బ్యాంకు జారిపోకుండా ఉండేందు కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తుంది. . కాంటాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించాడని అలా ఫిరాయించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని పదే పదే కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పలు మండలాల్లో రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేసిన ఆ ప్రచారాన్ని మొత్తం కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్ బలపడడానికి కూడా ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
అందువల్లే కాంగ్రెస్ దూకుడుగా రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాలను అడ్డుకుంటుంది. రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ప్రచారానికి వచ్చినప్పటికీ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. తాజాగా గత రాత్రి రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ ప్రచారం కొనసాగిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సర్దుకుపోవాలని గొడవ పెట్టుకోవద్దు అని రాజగోపాల్ రెడ్డి కోరారు. అయితే ప్రతి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి మీద గొడవ కు దిగుతున్నారు. గత రాత్రి చెప్పుతో దాడి చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు.
రాజగోపాల్ రెడ్డి సమన్వయం పాటించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం దూకుడు మీద రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. దీని ద్వారా తమ కేడర్ కూడా బలంగానే ఉందని చెప్పడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఇలా చేయకపోతే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం జారిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేసుకొని తన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. .దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బిజెపిగా కొనసాగుతుంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంత బీజేపీకి మళ్లుతుందని ఆ పార్టీ యోచిస్తుంటే కాంగ్రెస్ మాత్రం తమ ఓటు బ్యాంకు బిజెపి వైపు వెళ్ళ కుండా ఉండేది కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ మునుగోడు సీటు ఎవరి పరం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Pragathi: ఆ రకంగా చూస్తూ.. ఆంటీ అంటే నేను కూడా ఊరుకోను