నాన్ వెజ్ ప్రియులకు బంపరాఫర్ ప్రకటించాడు ఓ షాపు యజమాని.. మీరు.. ఒకేసారి మటన్, చికెన్ రెండూ తినాలి అనుకుంటే.. కేవలం మటన్ కొంటే సరిపోతుంది.. ఎందుకంటే.. మటన్ కొనుగోలుపై చికెన్ ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చాడు.. ఆ యజమాని.. ఇదేదో ఒక్కరోజుకే పరిమితమైన ఆఫర్ కాదు.. కానీ శనివారం మరియు సోమవారం షాపుకు సెలవు అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.. మొత్తంగా నాన్‌వెజ్ వ్యవహారం కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం.. వీకెండ్‌లో కూడా పెడితే ఎంత బాగుంటుందో అంటున్నారు.. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ? అనే వివరాల్లోకి వెళ్తే..
Read Also: TTD : రికార్డు స్థాయిలో తిరుమలేశుడి హుండీ ఆదాయం
తెలంగాణలోని జగిత్యాలలో శ్రీశాంత్ మటన్ అండ్ చికెన్ సెంటర్ యాజమాని.. నాన్‌వెజ్ ప్రియులకు కోసం ఓ బంపరాఫర్ తీసుకొచ్చాడు.. ఒక కేజీ మటన్ కొంటే అరకిలో చికెన్ ఫ్రీ అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఒక్క ఆఫర్ మాత్రమే కాదండోయ్.. అరకిలో మటన్ కొంటే 250 గ్రాముల చికెన్ ఫ్రీ, 3 కేజీల మటన్ కొంటే 1.5 కేజీల చికెన్ ఫ్రీ, 5 కేజీల మటన్ తీసుకుంటే 2.5 కేజీల చికెన్ ఉచితంగా పొందవచ్చు.. ఇంకా, ఏదైనా ఫంక్షన్లు చేసేవారికి ఆ ఆఫర్ ఎంతో ఉపయోగం.. ఎందుకంటే.. 10 కేజీల మటన్ కొనుగోలు చేస్తే ఏకంగా 5 కేజీల చికెన్ ఉచితంగా ఇస్తున్నారు.. దీంతో, మటన్ కొనుగోలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు.. కొత్తగా షాపు ప్రారంభించడంతో ఈ ఆఫర్ తీసుకొచ్చామని.. బిజినెస్ బాగా నడుస్తోందని చెబుతున్నారు ఆ షాపులో పనిచేసే సిబ్బంది.. ఇక, ఈ వ్యవహారం మొత్తంగా సోషల్ మీడియాకు ఎక్కింది.. ఆఫర్ చాలా బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. బిజినెస్ ఐడియా అదిరింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..