Bhatti Vikramarka about Mahalakshmi Scheme: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణాల వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ వేడుకలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం…
Arvind Dharmapuri on Raja Singh BJP membership: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీ రాజీనామాపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా భాయ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్కాల్ ఇస్తే చాలన్నారు. రాజా బాయ్ సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్ రిజైన్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంకు సూచించారు. ప్రతిఒక్కరికి పనిచేసేందుకు…
TSRTC Milestone: తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల జీరో టికెట్లను టీజీఎస్ ఆర్టీసీ జారీ చేయగా.. నేడు 200 కోట్ల మార్క్ తాకింది. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు చేయనున్నారు. ఎంజీబీఎస్…
ప్రస్తుత కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ కొనివ్వలేదని, నచ్చిన బైక్, కారు ఇప్పించలేదని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైనా తట్టుకోలక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని దారుణానికి ఒడిగట్టాడు. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి…
మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలు, ఒక అబ్బాయితో 60 ఏళ్ల వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. పిల్లలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. Also Read:Pawan Kalyan: రప్పా రప్పాపై పవన్ కౌంటర్.. బరిలోకి దిగి చూపించు.. జగన్ కు…
నిమ్స్ యూరాలజీ విభాగం రికార్డులను తిరగరాస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి సర్జరీలకు నమ్మకమైన చిరునామాగా నిలిచిన నిమ్స్, భారీ శస్త్రచికిత్సలు, ఆధునిక నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది. 2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ల బృందం గత పదేళ్లలో 1000కి పైగా కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా గత…
మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్..…
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.…