Illegal Affair: భర్తను దారుణంగా చంపేసింది ఓభార్య. భర్త వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. భర్త పరాయి మహిళలతో ఉండటమే కాకుడా..వారితో ఉన్న వీడియోలు తీసి భార్యకు చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. ఈ వేధింపులు భరించలేక భార్య ఆవేశంతో భర్తను హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బంధువుతో కలిసి భర్త వేణు కుమార్ ను చంపించి భార్య సుస్మిత ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండ్రోజులకు ఒకసారి ఖాకీల ఎదుట కన్నీటిపర్వంతమై నా భర్తను నావద్దకు చేర్చండి అంటూ వేడుకునేది. కాల్ డేటా ఆధారంగా కూపీ లాగిన పోలీసులు మృతుడికి వివాహేతర సంబంధల కారణంతో భర్తను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సెల్ల్ ఫోన్ సిగ్నల్ కాల్ డేటా ఆధారంగా 71 రోజుల తర్వాత హత్య కేసును పోలీసు ఛేదించారు. హత్య చేసి నటించిన భార్య సుస్మిత తీరుతో మొదట కన్ఫ్యూజ్ అయిన పోలీసులు.. వారం క్రితం కేసును సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు విచారణలో నా భర్త వేణు కుమార్ ఆచూకీ చెప్పాలని నటించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు హంతుకురాలు భార్య నే అని నిర్ధారణకు వచ్చారు. భర్త వేణు కుమార్ ను హతమార్చేందుకు మరో ముగ్గురితో కలిసి భార్య సుస్మిత ప్లాన్ వేసిందని గుర్తించారు పోలీసులు.
Read also: Manchu Manoj: నవ్విస్తున్న ‘వాట్సాప్’ చాట్ స్క్రీన్ షాట్స్
సుస్మిత భర్త వేణుకుమార్‌ను హత్య చేసేందుకు సుపారీ మాట్లాడింది. రూ. 4 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ. 2 లక్షలు. అందుకని ఒక ప్లాన్ వేసారు. దీని ప్రకారం గత సెప్టెంబర్ 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపింది. ఆ పాలను వేణు కుమార్ తాగించాడు. అది తాగగానే గాఢనిద్రలోకి జారుకున్నాడు. వెంటనే గడ్డం రత్నాకర్ కి ఫోన్ చేశాడు. వేణుకుమార్‌ని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. అతనితో వెళ్లిపోయాడు. కటిక మధ్యలో నవీన్‌ని కలుస్తుంది. మంథన్‌కు వెళ్లిన తర్వాత వేణుకుమార్‌ను బట్టలు విప్పి మానేరు నదిలో పడేశారు. నిద్ర మత్తులో మునిగిపోయి మృతి చెందాడు. అనంతరం అక్టోబర్ 3న వేణుకుమార్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుస్మితాదేవి తన భర్త కనిపించడం లేదని అక్టోబర్ 7న కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి విచారణ ప్రారంభించడంతో.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. భార్య నటనతో పోలీసులకు అనుమానం వచ్చి భర్తను హతమార్చింది భార్యే అని నిర్దారించి ఆమెను తనుకు సహకరించిన వారిని అదుపులో తీసుకున్నారు.