పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేదు.. సీఎం వైఎస్ జగన్ పిలిచి మాట్లాడారు ఇకపై నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.. నాపై పార్టీ మారుతున్నాని ప్రచారాలు జరుగుతున్నాయి.. కానీ, నేను వైఎస్ఆర్ అభిమానిని నేను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఇక, పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై చర్చించామని తెలిపారు ఎమ్మెల్యే…
Revanth Reddy: ప్రజలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50 శాతం కమిషన్లు దండుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ-డీ2 ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ఇవాళ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగి ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక…
* నేడు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణ.. అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికపై ఆరోపణలపై రిటైర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్ * వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు కడప నుంచి హైదరాబాద్‌కు తరలింపు.. కడప జైలు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు నిందితులను నాలుగు ప్రత్యేక వాహనాల్లో తరలించిన పోలీసులు.. నేడు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో నిందితులను హాజరపరచనున్న పోలీసులు * నేటి నుంచి తెలంగాణలో బీజేపీ…
Off The Record: ఇటీవల పార్టీ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు. కేవలం ఏదో ఆరోపణలు.. విమర్శలకు పరిమితం కాకుండా.. ఆ IAS అధికారులపై ఫిర్యాదు చేస్తామని.. వారు చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని సంజయ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆరోపణలు ఎలా ఉన్నా.. అసలు సంజయ్‌కు వారిపై సమాచారం…
Off The Record: తెలంగాణలో బలపడాలనేది బీజేపీ ఆలోచన. తద్వారా ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని ఆశిస్తున్నారు. చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటీని వేశారు. కానీ.. చేరికల విషయంలో కమలనాథులు ఆశించినట్టుగా అడుగులు పడటం లేదు. గతంలో చేరిన వాళ్లే కొందరు బీజేపీని వీడి వెళ్లిపోయారు. కొత్తగా ఎవరైనా వస్తానంటే వాళ్లను అడ్డుకునే పరిస్థితి ఉండటంతో కేడర్ విస్మయం చెందుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సోదరుడు బీజేపీలో చేరాలని అనుకుంటే.. ఆఖరి నిమిషంలో ఆయన చేరికను…
Mahindra Vehicles: మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్లు తెలిపింది.
లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని…
Asaduddin owaisi: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎంఐఎం పొత్తు గురించి ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చెప్పేందుకు ఇంకా టైం ఉందని అన్నారు. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు.
Minister KTR: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.