KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది. Pulaparthi Nani: లిక్కర్…
Jagadish Reddy vs Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై చర్చిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు కూడా సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఫామ్‌హౌస్‌లో…
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తప్పుపట్టారు. సోషల్ మీడియాపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సామజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అనవానించడం సబబు కాదని సూచించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే…
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ దైవంతో సమానం. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురునిలిచి కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా ఆ తల్లి విలవిల్లాడిపోతది. కానీ, ఓ తల్లి మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి కన్న కొడుకుపై రాయితో దాడి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కన్న కొడుకుపై రాయితో దాడి…
గత నెల 27న వినాయక విగ్రహాల తయారీ వద్ద నుంచి కొందరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా దొంగతనంగా ఓ ట్రాలీ వాహనంలో వినాయకుడి విగ్రహం పట్టుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని చంద్ర భవన్ కాంప్లెక్స్ లో జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం తో విగ్రహం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో సురేష్ ప్రతియేట గణనాధుల విగ్రహాలు తయారు చేసి…
ఇటీవల ఏపీ మంత్రి లోకేష్ బనకచర్లపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు.. లోకేష్ ముందు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి తెలుసుకోండి.. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృశ్య 968 టిఎంసి లు తెలంగాణ కు, 531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్…
బాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నిందితులపై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేస్తుంటారు. తాజాగా ఓ మహిళపై పోక్సో కేసు నమోదైంది. మహిళపై పోక్సో కేసు నమోదవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయానికి వస్తే.. ఓ మహిళ మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకుని అతడిని తీసుకుని పారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళ పై పోక్సో కేస్ నమోదు చేశారు…
గతంలో హిందువులను టెర్రరిస్టులుగా అప్పట్లో యూపీఏ సర్కార్ చూపించింది అని ఆరోపించారు. పాకిస్థాన్ ఏజెంట్ లుగా యూపీఏ నేతలు మారారు.. హిందువుల్లో ఐక్యత తక్కువగా ఉంటుందనే అధికారంలో ఉండే పార్టీలు ఇలా చేస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ సైనికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తారు అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పదవి నాకు వద్దని చెప్పలేదు, కావాలని నేను అధిష్టానాన్ని అడగలేదన్నారు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది..