* నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. నేటి సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి..
* నేడు ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీకి సీఎం రేవంత్.. పలువురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశం.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్..
* గ్రూప్-1 అంశంపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు.. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు వినతి.. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు.. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం.. ఇవాళ తుది తీర్పు ఇవ్వనున్న తెలంగాణ హైకోర్టు..
* నేడు ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న నారా లోకేష్..
* నేడు ఉదయం 11 గంటలకి ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో కీలక సమావేశం.. స్థానిక ఎన్నికలు, కొత్త ఈవీఎంల కొనుగోలు, రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సెక్రెటరీలతో నీలం సాహ్ని సమావేశం.. ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని..
* నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు.. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వైసీపీ ఆందోళన.. ఉల్లి, టమాటా రైతులకు గిట్టుబాట ధర కల్పించాలని డిమాండ్.. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు..
* నేటితో పూర్తి కానున్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్.. ఏడుగురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు..
* నేటితో ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్ పూర్తి.. ఇవాళ సంజయ్ ని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు.. నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్.. ఐపీఎస్ అధికారి కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న కోర్టు..
* నేడు పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటన.. గురుదాస్ పూర్ లో వరద ప్రాంతాలను పరిశీలించనున్న ప్రధాని మోడీ..
* నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ప్రారంభం.. దుబాయ్ వేదికగా తొలి పోరులో హాంగాంగ్ తో తలపడబోతున్న అఫ్గనిస్తాన్.. ఇవాళ రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం.. రేపు యూఏఈతో తలపడబోతున్న టీమిండియా..