వరంగల్ నగరంలో కిడ్నాప్ డ్రామా కలకలం రేపింది. ఆన్లైన్ బెట్టింగుల్లో డబ్బులు పెట్టి, అప్పులు చేసి, చివరికి కుటుంబ సభ్యులను మోసం చేసే దిశగా ఓ యువకుడు ప్లాన్ చేశాడు. కానీ చివరకు తన ప్లాన్ అట్లర్ ప్లాప్ అయ్యింది. వరంగల్ కొత్తవాడ ప్రాంతానికి చెందిన ఆదిల్ సోనీ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగుల్లో సుమారు 8 లక్షల అప్పు చేశాడు. అప్పులు ఇచ్చినవారు తిరిగి అడుగుతుండడంతో తనకు తానే కిడ్నాప్ స్కెచ్ వేసుకున్నాడు ఆదిల్ సోనీ.. తనని ఎవరో కిడ్నాప్ చేశారంటూ.. డబ్బులు ఇస్తే వదిలేస్తారని ఎనిమిది లక్షలు డిమాండ్ చేస్తున్నారని తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
Also Read:Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం.. తొలి ఓటు వేసిన మోడీ
ఆందోళనకు గురైన ఆదిల్ సోనీ తండ్రి అశోక్ సోనీ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 3గంటల వ్యవధిలో ఆదిల్ సోనీ ని గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం కిడ్నాప్ డ్రామా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. తమదైన శైలిలో విచారించి కిడ్నాప్ డ్రామాకు తెరదించారు పోలీసులు.