మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు. ముందుగా ట్రైన్ కింద పడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రియుడు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read:US-India: భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ సలహాదారు నవారో
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్న కూతురు హితవర్షిణి(20). ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లిన హితవర్షిణి.. తిరిగి కాలేజ్ ప్రారంభం అవుతుండడంతో హైదరాబాద్ వచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమోగాని బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:Social media: నిషేధం ఎత్తివేత.. ఎక్కడంటే
యువతి చివరిగా తన గ్రామానికి చెందిన వినయ్ బాబు (28) అనే యువకుడితో ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. అతడిని విచారించేందుకు వెళ్లగా అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్నారు. యువకుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా, వీరిద్దరు ప్రేమించుకున్నారని, పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. వినయ్ బాబు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.