తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్ వారీగా, డివిజన్ వారీగా మంజూరు అవుతాయని.. వాటిలో కొన్ని సార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా.. తాజాగా పేపర్ లీకేజ్ కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశ్నపత్రం లీకు కలకలం రేపింది.
రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు..! మార్చురీలో లేచాడు..! చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడం ఏంటి? మార్చురీ అంటేనే శవాలను భద్రపరచడానికే.. పోస్టుమార్టం నిర్వహించడానికో తరలిస్తారు.. అక్కడ చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా తిర్మన్పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. అయితే, నిజామాబాద్ నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతిచెందినట్టు చెప్పారు.. దీంతో, మార్గమద్యలోనే మృతిచెందాడని భావించి.. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి…
సికింద్రాబద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో వెయిటింగ్ లిస్ట్ 400ను దాటింది. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయిటింగ్ చూపుతున్నా.. ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపడం లేదు.
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ జడ్జ్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్(63) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. టెన్షన్ పెడుతోన్న ఆ నిబంధన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థుల సంఖ్య…