పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు. టెన్త్ పేపర్ లీకేజీలపై బండి సంజయ్ అరెస్ట్ స్పందించిన మంత్రి హరీశ్ రావు సంజయ్ పై…
బండి సంజయ్ అర్థరాత్రి అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి అరెస్టు చేయడం…
తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దళిత మేధావులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు.
జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండలం సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ జరిగింది. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్లకురుమలు అడ్డుకున్నారు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలపై హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి నేతృత్వంలో సీబీఐ అధికారులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితం ఈడీ అధికారులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే.. నిన్న జరిగిన సీఎం సమీక్షకు గైర్హజరుపై స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్న.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదన్నారు. ఇక, నేను, కొడాలి నాని పార్టీ మారుతున్నాం అంటూ ప్రచారాలు వచ్చాయి.. అవి మెరుపు కలలు మాత్రమే.. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష…