ఈఏపీ సెట్లో మళ్లీ ఇంటర్ వెయిటేజీ.. కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. విద్య ఆన్లైన్కే పరిమితమైంది.. పరీక్షలు కూడా లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేశారు.. ఇక, గతంలో ఉన్న మార్కుల వెయిటేజీ సైతం ఎత్తివేసింది ప్రభుత్వం.. కానీ, ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మళ్లీ వెయిటేజీ తప్పనిసరి చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్–2023లో ఇంటర్మీడియెట్ మార్కులకు…
టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ స్టేట్మెంట్ రికార్డు చేసింది.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారని వెల్లడించారు. చీఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు.
రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తోందని ఆయన విమర్శించారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ క్రమంలో విపక్ష నేతలతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పిచ్చోడని.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడని.. రేవంత్ రెడ్డికి మెదడు లేదని ఆయన విమర్శించారు.