భవిష్యత్ తరాల కోసం చేపట్టిన మంచి కార్యక్రమం కూల్ రూఫ్ తో తాత్కాలిక లక్ష్యాలతో, అందరికీ లాభం చేకూరేలా పాలసీ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ దేశంలోనే ఎక్కువ ఆఫీస్ స్పేస్ తీసుకుంటున్న నగరం.. బెంగుళూర్ ను ఆఫీస్ స్పేస్ తో పాటుగా, ఎంప్లాయ్ మెంట్ లో కూడా హైదరాబాద్ దాటింది. తెలంగాణలో అన్ని డిపార్ట్ మెంట్ లు చాలా బాగా పని చేస్తున్నాయి… మన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని ఆయన అన్నారు. 2014లో ఈసీబీసీని అడాప్ట్ చేసుకున్నాము. హరిత హారంలో మొక్కలు నాటుతున్నాం.. ఎన్నో అవార్డ్ లు గెలుచుకున్నాము అని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనర్జీ ఎఫిషియంట్ మెషిన్ లను వాడమని చెబుతున్నాము.. మన భవిష్యత్ తరాల కోసం తెస్తున్న పాలసీ ఇది అన్నారు.
Also Read : Aha: తెలుగు ఇండియన్ ఐడల్ నుండి మానస అవుట్!
ఈ సంవత్సరం నగరంలో 5 స్క్వేర్ కిలో మిటర్లు.. నగరం అవతల 2.5 స్క్వేర్ కిలో మీటర్ల కూల్ రూఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సైకిల్ ట్రాక్ కు సోలార్ రూఫ్ చేస్తున్నాము.. భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికిల్స్ దే చట్టం తేవడం ఈజీ దానిని పాటించడమే కష్టం అని ఆయన అన్నారు. మా ఇంటి కూడా ముందే కూల్ రూఫ్ చేయించాను అని కేటీఆర్ వెల్లడించారు. రూఫ్ తో పాటు వాల్స్ కు కూడా వేయాలి..
దీనిని తప్పనిసరి చేస్తున్నాము. కూల్ రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. కూల్ రూఫ్ ను అమలు చేస్తే రెండు సంవత్సరాల్లో ఎనర్జీ సేవింగ్ రూపంలో మన డబ్బులు మనకు వస్తాయన్నారు.
Also Read : Top10 Banks In India : దేశంలోని టాప్10 బ్యాంకులు ఇవే
హైదరాబాద్ తో పాటుగా మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే కూల్ రూఫ్ కార్యక్రమం 100 శాతం అమలవుతుందన్నారు. సీపీఆర్ విషయంలో ప్రతి అపార్ట్ మెంట్ కు వెళ్లి అవగాహన కల్పించాలి.. అవసరమైతే ఇన్ సెంటివ్ ఇస్తాము.. RWSను కూడా ఇందులో పార్టిసిపేట్ చేపిస్తాము.. త్వరలో మన నగరంలో కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. రెండు సీ అండ్ డీ వేస్ట్ ప్లాంట్ లను ప్రాభించాము.. వాటి ద్వారా కూల్ బ్లాక్స్ చేసే వీలు ఏమైనా ఉంటుందా అనేది చూడాలని కేటీఆర్ అన్నారు.
Also Read : Top10 Banks In India : దేశంలోని టాప్10 బ్యాంకులు ఇవే
అర్బన్ రూఫ్ ఫామింగ్ ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది.. వాటిని ఎంకరేజ్ చేయాలి.. నాలుగు ఓట్లు వస్తాయని కూల్ రూఫ్ పాలసీ విధానం తేవడం లేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి హైదరాబాద్ లో 200 చదరపు కిలోమీటర్లు, మిగతా ఏరియాలో 100 చదరపు కిలోమీటర్లు కూల్ రూఫింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పైన 10 కోట్ల చదరపు కిలోమీటర్లు కూల్ రూఫ్ చేసే అవకాశం ఉందన్నారు. కూల్ రూఫ్ పాలసీకి చదరపు మీటర్ కు 300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఈ పాలసీ తేవడం లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.