పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో
ఎన్నికల సమయం వచ్చేసింది. రాజకీయ పార్టీలు తమ తమ పార్టీలను గెలిపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థులపై మాటల తూటాలను విసిరేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల కన్నుమొత్తం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీదనే ఉంది. విశాఖలో గెలవాలి అంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలి. దానికోసం ఎవరివంతు కృషి వారు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మీడియా సమావేశం పెట్టి మరీ మాట్లాడారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో కలిసి విశాఖపట్నంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్.. పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పవన్ కు మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. “ఎవరికో పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయొద్దు.. తమ్ముడు నువ్వు కూడా రా.. జాయిన్ అవ్వు.. ఎందుకు నీకు బీజేపీ.. బీజేపీతో పొత్తులెందుకు. అదే బీజేపీని తిట్టి బీఎస్పీలో చేరావు కదా. 2019 లో ఎలెవెన్స్ పెట్టుకున్నావు కదా. మరలా అదే బీజేపీకి ఎందుకు వెళ్ళావ్. నువ్వు వెళితే ఢిల్లీలో వాళ్లు కలుస్తున్నారా..? నీకు రోడ్డు మ్యాప్ ఇస్తానని నాలుగేళ్లుగా చెప్తున్నారు.. ఇచ్చారా..? ఏంటా.. బతుకు.. రాజీనామా చేసేసి ఆస్ట్రేలియా వెళ్తాను అన్నావ్ వెళ్ళిపో.. లేదా మీ పార్టీని మా పార్టీలో విలీనం చెయ్.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై జగన్ సమీక్ష
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం పై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులు గురించి వాకబు చేశారు. అంగన్ వాడీలలో నాడు – నేడు పనుల పై సీఎం సమీక్ష చేశారు. అంగన్‌వాడీ సెంటర్లలో ఉన్న సదుపాయాల పై గ్రామ సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకోవాలి. అంగన్‌వాడీల్లో చేపట్టాల్సిన పనుల పై ప్రతిపాదనల పై నివేదిక తయారు చేయండి. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్ లను అంగన్‌వాడీల్లో ఉంచాలన్నారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయండి. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలి. క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలి. అంగన్‌వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇటు జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మాన, బొత్స సత్యనారాయణ, ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం. మే 20 నాటికి 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలన్నారు సీఎం జగన్. ఇప్పటికే 1.94 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీకి సిద్దం అయ్యాయి. భూ వివాదాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. అర్బన్ ఏరియాల్లో పీఓఎల్ఆర్ నివేదికలపై సమీక్ష చేశారు సీఎం జగన్.
గాంధీ కుటుంబంపై చెంప దెబ్బ….సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. భారతదేశంలో రాజ్యాంగం విజయం సాధిస్తుందని, రాజవంశ రాజకీయాలు కాదని తీర్పు స్పష్టం చేసిందని ఆ పార్టీ పేర్కొంది. ఇది గాంధీ కుటుంబానికి చెంపపెట్టు అని, చట్టం అందరికీ ఒకటేనని, ఎవరూ అతీతులు కాదని ఈరోజు సూరత్ కోర్టు నిరూపించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. గాంధీ కుటుంబం యొక్క అహంకారానికి దెబ్బ, భారతదేశంలోని సామాన్య ప్రజల విజయం అని పేర్కొన్నారు.మోదీ ఇంటిపేరు వ్యాఖ్యపై తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌ను సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. గత గురువారం, అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్‌పి మొగేరా కోర్టు స్టే కోసం గాంధీ చేసిన దరఖాస్తుపై తీర్పును ఏప్రిల్ 20కి రిజర్వ్ చేసింది, ఈ కేసులో అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉంది.
2024 లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు
2024 లోకసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలను ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొత్తగా 8.92 లక్షల కొత్త వీవీపాట్ మెషీన్‌లకు ఆర్డర్ చేసింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVMలు) తప్పుగా ఉన్నాయనే ఆందోళనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. వీవీపాట్ స్టాక్ ను సమీక్షించడం ద్వారా వాడుకలో లేని ఎం2 వీవీపాట్ యంత్రాలను రిటైర్ చేయడంతో పాటు కొత్తవాటిని ఉత్పత్తి చేయడం, అందుబాటులో ఉన్న ఎం2ఎం3 యంత్రాలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీల్లో, ఓటర్లలో ఉన్న అనుమానాలను తొలగించేందుకు గత ఎన్నికల్లో ఈసీ వీవీపాట్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 17.4 లక్షల వీవీపాట్లను మోహరించారు. ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా వీటిని ఉపయోగించారు. ఎన్నికల అనంతరం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మరియు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లతో పాటు సాంకేతిక నిపుణుల కమిటీ సమగ్ర విశ్లేషణను నిర్వహించి ఎం3 వీవీపాట్ ల పనితీరును మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు అవసరం అని నిర్థారించింది.
ఏపీలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తోంది
ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా టీడీపీ నేతలు బీజేపీ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బీజేపీపై హాట్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే బీజేపీ నేతలు భయపడుతున్నారన్నారు. టీడీపీతో జనసేన పార్టీని కలవకుండా బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తాం అన్నారు పితాని. బీజేపీ ముందు ఒక రాజకీయం తెర వెనుక మరో రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి దేశానికి బీజేపీ అవసరమా అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతుందన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. టీడీపీ నేతల కామెంట్లపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి.
హైదరాబాద్ పరిసరాల్లో పులి సంచారం.. జనం భయం భయం
అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు జానరణ్యంలోకి వస్తున్నాయి. వచ్చి మూగజీవాలపై దాడులు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. బౌరంపేట రింగురోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపడంతో రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. సమాచారం అందుకున్న సురారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అటవిశాఖ అధికారులు సేకరించారు. పులి సంచరిస్తున్న వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానికులు చెబుతున్న వర్షన్.. ఫారెస్ట్ అధికారులు చెబుతున్న వర్షన్ కి చాలా తేడా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా పులి సంచారిస్తుందని స్థానికులు చెబుతున్నారు.. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. తాము స్వయంగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు చూసినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పులి సంచరిస్తున్నట్లుగా సీసీటీవి ఫుటేజ్ ఆనవాళ్లు ఉన్నాయి. కానీ అటవి శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. పులి సంచరిస్తుడంటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సీఎం జగన్ రాకను ఎవరూ అడ్డుకోలేరు
ఏపీ సీఎం జగన్ సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన జరుగుతుంది..సీఎం జగన్ రాకను ఎవరు అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం పరిపాలనను ఎక్కడ నుంచి అయినా నిర్వహించవచ్చు. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సీఎం జగన్ వైజాగ్ సెప్టెంబర్ లో కూడా రారని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారపి మండిపడ్డారు. వచ్చే నెల మూడో తేదీన భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారా? ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
EOIపై ఆసక్తి చూపని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డింగ్ పై ఆసక్తి చూపించకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. స్టీల్ ప్లాంట్ EOIకి మలివిడతలో 7 అప్లికేషన్లు వచ్చాయి. నిర్ధేశించిన సమయం ముగిసే సరికి ఆసక్తి చూపించిన 29సంస్థలు అని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ కి అంతగా ఆసక్తి కనబరచలేదు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ముందు ఆసక్తి చూపించింది. అయితే తాజాగా సింగరేణి కాలరీస్ నుంచి ప్రతిపాదన రాలేదంటున్నాయి కార్మిక సంఘాలు. టెండర్ ప్రక్రియలో విదేశీ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాయి కార్మిక సంఘాలు. బిడ్డింగ్ కు ఆలస్యం జరగడానికి గల కారణాలను తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటున్నాయి. EOIకి రాని సంస్థలు కూడా టెండర్లకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. మహానది కోల్ ఫీల్డ్స్ తో పోలిస్తే సింగరేణి నుంచి బొగ్గు తీసుకుని రావడం ఆర్ధికంగా భారమైన వ్యవహారంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం EOIకి వచ్చిన రాకపోయిన పార్లమెంట్ లో ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగించాలని కార్మిక సంఘాలు ,పోరాట కమిటీ నాయకులు కోరుతున్నారు.
తొలిసారి రూ.5 ట్రిలియన్లు దాటిన ఐటీసీ మార్కెట్ క్యాప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గురువారం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత లాభాల్లోకి వచ్చి ఇంట్రాడేలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులతోపాటు లోకల్ కంపెనీల క్యూ4 ఫలితాలు ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేశాయి.సెన్సెక్స్ నామమాత్రంగా 64 పాయింట్లు పెరిగి 59 వేల 632 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. సింగిల్ డిజిట్.. అంటే.. 5 పాయింట్లు మాత్రమే పెరిగి 17 వేల 624 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎన్‌టీపీసీ, ఏసియన్ పెయింట్స్ విశేషంగా రాణించాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. ఎన్‌టీపీసీ, ఐటీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ వంటి లార్జ్ క్యాప్స్.. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు మద్దతుగా నిలిచాయి. మరో వైపు.. ఇన్ఫోసిస్, రిలయెన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ స్టాక్స్ ఒత్తిడి పెంచాయి. ఇదిలాఉండగా.. ఐటీసీ సంస్థ తొలిసారిగా ఎలైట్ గ్రూప్ కంపెనీల జాబితాలోకి చేరింది. మార్కెట్ క్యాప్ వ్యాల్యూ 5 ట్రిలియన్ రూపాయలు దాటిన సంస్థలను ఎలైట్ గ్రూప్ కంపెనీలుగా వ్యవహరిస్తారు.