విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డింగ్ పై ఆసక్తి చూపించకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. స్టీల్ ప్లాంట్ EOIకి మలివిడతలో 7 అప్లికేషన్లు వచ్చాయి. నిర్ధేశించిన సమయం ముగిసే సరికి ఆసక్తి చూపించిన 29సంస్థలు అని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ కి అంతగా ఆసక్తి కనబరచలేదు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ముందు ఆసక్తి చూపించింది. అయితే తాజాగా సింగరేణి కాలరీస్ నుంచి ప్రతిపాదన రాలేదంటున్నాయి కార్మిక సంఘాలు.
Read Also: SCO Foreign Ministers Meeting: వచ్చే నెలలో భారత్ రానున్న పాక్ మంత్రి.. 2014 తర్వాత ఇదే మొదటిసారి..
టెండర్ ప్రక్రియలో విదేశీ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాయి కార్మిక సంఘాలు. బిడ్డింగ్ కు ఆలస్యం జరగడానికి గల కారణాలను తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటున్నాయి. EOIకి రాని సంస్థలు కూడా టెండర్లకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. మహానది కోల్ ఫీల్డ్స్ తో పోలిస్తే సింగరేణి నుంచి బొగ్గు తీసుకుని రావడం ఆర్ధికంగా భారమైన వ్యవహారంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం EOIకి వచ్చిన రాకపోయిన పార్లమెంట్ లో ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగించాలని కార్మిక సంఘాలు ,పోరాట కమిటీ నాయకులు కోరుతున్నారు.
Read Also: Gudivada Amarnath: సీఎం జగన్ రాకను ఎవరూ అడ్డుకోలేరు