రిషి సునాక్‌కు షాక్.. బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా..
బ్రిటన్‌లో అధికారం చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖా మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత మంత్రిత్వ శాఖలోని సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ బెదిరింపు ఆరోపణలపై దర్యాప్తు కమిటీ నివేదిక ప్రధాని రిషి సునాక్‌కు అందిన కొన్ని గంటల్లోనే డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్‌కు రాసిన రాజీనామా లేఖను ట్విటర్‌లో డొమినిక్ రాబ్ పోస్ట్ చేశారు. అక్టోబరులో రిషి సునక్ బ్రిటిష్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలతో సునాక్ కేబినెట్‌లో రాజీనామా చేసిన వ్యక్తుల్లో డొమినిక్ రాబ్ మూడో వ్యక్తి కావడం గమనార్హం. డొమినిక్ రాబ్‌పై బెదిరింపు ఆరోపణలపై వచ్చిన రెండు ఫిర్యాదులను పరిశీలించడానికి సీనియర్ ఉద్యోగ న్యాయవాది ఆడమ్ టోలీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నియమించారు. డొమినిక్ రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకునే అవకాశం ఉండగా, ఆలోపే రాబ్ రాజీనామా చేశారు. టోలీ తన నివేదికను రిషి సునాక్‌కు గురువారం ఉదయం పంపినట్లు ప్రధాన మంత్రి ప్రతినిధి ధృవీకరించారు.
ఈ స్టాంపింగ్ విధానంతో ప్రయోజనాలెన్నో!
ఈఏడాది ఏపీలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరిగింది. గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తుంది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం..రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం – ఇ –స్టాంపింగ్ సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించే ఇ–స్టాంపింగ్ విధానం ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఆవిష్కరణ అయింది. ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది. www.shcilestamp.com వెబ్‌సైట్‌లో మరియు ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఇ–స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చు. నగదు,చెక్కు,ఆన్‌లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఎస్‌బీఐ,ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయని సీఎం చెప్పారు. ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చు
విజయవాడలో త్వరలో రాజశ్యామల యాగం
రాష్ట్ర సంక్షేమం కోసం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజ శ్యామల యాగం నిర్వహిస్తామన్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మే 12వ తేదీ నుంచి 6 రోజుల పాటు యాగం నిర్వహిస్తామన్నారు. ప్రతీ రోజూ ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానిస్తున్నాం. మొత్తం 450 మంది ఋత్విక్కులు ఈ యాగంలో పాల్గొంటారని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. యాగం నిర్వహణ కోసం దేవాదాయశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీలు వేస్మతామన్నారు. ఈ యాగానికి ప్రజలను ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారికి నీరు, మజ్జిగ, ప్రసాదాలను అందజేస్తాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పార్టీలు వేరైనా రాజకీయ నాయకుల పరస్పరం జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఇబ్బందేం లేదు. సామాజిక మాధ్యమాలు దీనికి వేర్వేరు భాష్యాలు చెబుతున్నాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఆయనకు ఆయనే తిట్టుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. వైసీపీని నోటికి వచ్చినట్టు తిడితే ప్రజల మద్దతు వస్తుందా..? లోకేషును పాదయాత్రలోనే జనం తరిమి కొడతారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే బ్రోకర్. ఆయన బినామీ ఆస్తులు ఎప్పుడో రెండు లక్షల కోట్లు దాటాయని ఆయన ఆరోపించారు.
ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైఎస్.జగన్ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. సంబంధిత శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్నారు సీఎం. మానవ ప్రమేయాన్ని తగ్గించి… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. లో ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సమగ్ర సమీక్ష చేశారు సీఎం జగన్. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎంకు వివరించారు వివిధ శాఖలకు చెందిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి సాధించింది. 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వెల్లడించారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అధికారులు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నామన్నారు అధికారులు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడంద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. వీటిపై దృష్టిపెట్టాలన్నారు సీఎం.
మార్కెట్ విలువ విషయంలో హెచ్ డి ఎఫ్ సీని దాటేసి…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు. దీంతో కీలక సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి.కానీ.. ఇంట్రాడేలో మాత్రం భారీ లాభాలను పొందలేకపోయాయి. రోజంతా నెగెటివ్ మూడ్‌లో ట్రేడింగ్ జరగటమే దీనికి కారణం. ముఖ్యంగా స్టాక్ మరియు సెక్టార్ అనే అంశాలు ఆధిపత్యం చెలాయించాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం ఎట్టకేలకు నామమాత్రపు లాభాలతో ఎండ్ అయ్యాయి.సెన్సెక్స్ 22 పాయింట్లు పెరిగి 59 వేల 655 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 17 వేల 624 పాయింట్ల వద్ద ముగిసింది.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 14 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగతా 16 కంపెనీలు వెనకబడ్డాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. ఐటీసీ మరియు టీసీఎస్ భారీగా రాణించాయి.
అయ్యగారిని తండ్రిగారు లైట్ తీసుకుంటున్నారట
అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం తన కన్నా తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చిన్న కొడుకు అఖిల్ విషయంలో నాగ్ ఎప్పుడు అశ్రద్ధ చేయడు. అఖిల్ సినిమా నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో అఖిల్ కు అండగా నిలిచాడు. అయితే ఈసారి మాత్రం నాగ్.. కొడుకును లైట్ తీసుకున్నాడా..? అంటే నిజమే అంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు అని చెప్పుకొస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ అందుకున్న అఖిల్.. ఈసారి ఏజెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అయ్యగారు ఒక్కరే కనిపిస్తున్నారు. ఇటు పక్క నాగ చైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అయితే కెమెరా కంటికి చిక్కడమే అరుదుగా మారిపోయింది. కనీసం కొడుకుల ట్రైలర్, టీజర్ లను ట్విట్టర్ లో కూడా షేర్ చేయలేదు. సరే చై .. కస్టడీ అంటే బై లింగువల్.. తన కొత్త జర్నీ తనకే వదిలేశాడు అనుకోవచ్చు. అఖిల్ ను కూడా అలాగే వదిలేశాడా..?
ప్రపంచ సినిమా చూపు తెలుగు చిత్రసీమ వైపు!
“‘బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్” వంటి చిత్రాలతో యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారని, ఇప్పుడు దేశం, భాషలకు అతీతంగా దక్షిణ భారత చిత్రాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాలంటే అబ్బురపడేలా చేశారని, ఈ ఎదుగుదల క్రమం చూసి ప్రాంతీయ, చిన్న దేశాల చలన చిత్ర నిర్మాణ సంస్థలు సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద’ని నేపాల్ సూపర్ స్టార్ భువన్ కె.సి., యంగ్ క్రేజీ స్టార్ ఆయుష్మాన్, నేపాల్ చలన చిత్ర ప్రముఖులు పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండు లోని నేపాల్ ఫిలిం బోర్డ్ ఆడిటోరియంలో ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేపాల్ ఫిల్మ్ ప్రమోషన్ సర్క్యూట్ సంయుక్తంగా నిర్వహించిన ఇండో నేపాల్ ఫిలిమ్ ఎక్స్చేంజి – 2023 సదస్సుకి ఇండియా నుండి ఎఫ్.టి.పి.సి. అధ్యక్షులు చైతన్య జంగా, కార్యదర్శి వి.ఎస్. వర్మ పాకలపాటి హాజరు కాగా ఇందులో నేపాల్ చలన చిత్ర ప్రముఖులు పాల్గొని ఈ సదస్సుని విజయవంతం చేశారు.
విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే దెబ్బకు నాలుగు రికార్డులు
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సహకారంతో అతను 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ నాలుగు రికార్డులను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 59 పరుగులతో విరుచుకుపడిన కింగ్ కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 6500 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఐపీఎల్‌లో 229 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. మొత్తం 6903 పరుగులు చేయగా, అందులో ఆర్సీబీ కెప్టెన్‌గా 5333 పరుగులు సాధించాడు. అలాగే టీమిండియా టీ20 కెప్టెన్‌గా 1570 పరుగులు నమోదు చేశాడు. ఇలా టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 6500 పరుగులు చేసిన కోహ్లీ.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు కొట్టడంతో.. టోటల్ ఐపీఎల్‌లో 600 ఫోర్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా.. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 730 ఫోర్లతో శిఖర్ ధావన్ అగ్రస్థానంలోనూ, 608 ఫోర్లతో ఫోర్లతో డేవిడ్ వార్నర్ రెండో స్థానంలోనూ ఉన్నారు.