డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్నీ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యావిధానం-2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలకు తెలిపింది.
Also Read : Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..
ఇందులో భాగంగా యూజీసీ చైర్మన్ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చర్చించారు. ఆనర్స్ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని .. అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
Also Read : Astrology : ఏప్రిల్ 21, శుక్రవారం దినఫలాలు
డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఎంచుకున్న సరే దానికి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా.. బోధన విధానంతో అమలు చేయడమే ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్, బీకాం ఆనర్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశ పెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్ సైన్స్ కోర్సును ఆనర్స్ గా తేవాలనే యోచనలో ఉంది. విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Sumitra Pampana : ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ఇంట్లో చోరీ.. కిలోల కొద్ది బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు వృత్తి విద్య కోర్సులకు పోటీనిస్తాయి. డిగ్రీతో పాటు మంచి ఉద్యోగాలు పొందడమే కాదు.. సాఫ్ట్ వేర్ రంగంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దాలాన్నదే లక్ష్యం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో వీటిని అమలు చేసే అవకాశం ఉంది. మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏడాది విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా డిజైన్ చేస్తున్నారు.
Also Read : chhattisgarh: 20 ఏళ్ల క్రితం హత్య చేశా.. ఇప్పుడు కలలో వేధిస్తున్నాడు.. ఓ వ్యక్తి వింత ఆరోపణ
అయితే అన్ని దేశాల్లోనూ సాఫ్ట్ వేర్ రంగం విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలూ ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఇంజనీరింగ్ బాట పడుతున్నారు. అయితే డిగ్రీతోనూ సాప్ట్ వేర్ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్ కోర్సులను ఆనర్స్ గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూర్ సైన్స్ జోడించబోతున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులను తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్పీ ( ఆనర్స్ ) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో పరిమితంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతిలివ్వాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఆనర్స్ కోర్సుల్లో చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని.. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు.