రూపాయి ముట్టుకున్నా సర్వనాశనమైపోతాం..
భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల రాజేందర్ రాకపోవడంతో రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “నేను అమ్మవారిని నమ్ముతాను. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో ఆందరికి తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు వందల కోట్లు ఖర్చుపెట్టాయి. ఆ ఎన్నికల సందర్భంగా రూ.3 వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ప్రజాతీర్పు కోరింది. గతంలో పాల్వాయి స్రవంతి విసిరిన సవాల్ బీఆర్‌ఎస్, బీజేపీలు స్పందించలేదు. మునుగోడులో రూ.3వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మునుగోడులో మద్యం పంపిణీ లేకుండా మేం ఓట్లు అడిగాం. ఒక్క రూపాయి పంచకున్నా పాల్వాయి స్రవంతికి పాతికవేల ఓట్లు వచ్చాయి. నిజాయితీగా 25వేల మంది కాంగ్రెస్ వెంట నిలిచారు.” అని రేవంత్ అన్నారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నానంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణం చేశార. “అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నా. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ నుంచి సాయం పొంది ఉంటే మేమే సర్వనాశనమవుతాం. నేను చెప్పింది అబద్ధమైతే.. సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్ ఆలోచించి మాట్లాడాలి” అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని భావించే యువతకు గుడ్ న్యూస్. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది. భారతీయుల కోసం విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేస్తుందని ఒక ఉన్నత అధికారి హామీ ఇచ్చారు. US అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డోనాల్డ్ లూ మాట్లాడుతూ వర్క్ వీసాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. H-1B, L వీసాలు, భారతదేశం నుండి IT నిపుణులు ఎక్కువగా కోరుకునేవి అని చెప్పారు, H-1B వీసా అనేది వలసేతర వీసా. ఇది US కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు దానిపై ఆధారపడి ఉంటాయి. తాము ఈ సంవత్సరం మిలియన్ కంటే ఎక్కువ వీసాలు జారీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని అధికారి డోనాల్డ్ లూ అన్నారు. విద్యార్థుల వీసాలు, ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్యతో పాటు ఇది తమకు ఒక రికార్డు అని చెప్పారు. ఈ వేసవిలో పాఠశాల ప్రారంభమయ్యే భారతీయుల కోసం అన్ని విద్యార్థి వీసాలను ప్రాసెస్ చేస్తుందని నిర్ధారించుకోవడానికి US కట్టుబడి ఉందని లూ చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలకు అమెరికాలో ద్వైపాక్షిక మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. ఒక మిలియన్ మందికి పైగా ప్రజలు రెండు దేశాల మధ్య అటూ ఇటూ తిరుగుతున్నారు.
దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..?
ఏపీలో దళిత సంక్షేమంపై విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏపీలో దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్ విసిరారు టీడీపీ నేత వర్ల రామయ్య. వైసీపీలోని దళిత మంత్రులపై సీరియస్ కామెంట్లు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. వైసీపీ దళిత మంత్రులు జగన్ మోచేతి నీరు తాగుతున్నారు. వైసీపీ దళిత మంత్రులు బిస్కెట్ బ్యాచ్. కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వైసీపీలో దళితులకు బిస్కెట్లు వేస్తారు.వైసీపీలోని దళిత మంత్రులంతా చీరలు కట్టుకోవాలి.విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టినప్పుడే వైసీపీలో దళితులు ఫినిష్ అయింది.మంత్రిగా ఉండి చొక్కా విప్పి గంజాయి తాగిన వాడిలా సురేష్ వ్యవహరించారు.మంత్రి సురేష్ ఓ యూజ్ లెస్ ఫేలో. ఐఆర్ఎస్ చేసిన సురేష్ బఫూన్ మాదిరి వ్యవహరించారు.సజ్జల చెబితే చొక్కా విప్పడానికి సురేషుకైనా సిగ్గుండాలిగా..?డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి మతి స్థిమితం లేదు.నారాయణ స్వామికి సిగ్గు ఎగ్గు లేదని మండిపడ్డారు వర్ల రామయ్య.
స్టీల్ ప్లాంట్ కొనే స్తోమత నా ఒక్కడికే ఉంది
తెలుగు రాజకీయాలకు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ముడి సరకుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సంస్థను పరిరక్షించడంలో ఛాంపియన్స్ అనిపించుకోవాలని పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎంట్రీ ఏపీ పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టేసింది.ఆ తర్వాతి నుంచి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి కలయికే ఒకటి జరగ్గా…..వాళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన వ్యక్తులు కావడం చర్చకు కారణం అయింది. ఆ ఇద్దరిలో ఒకరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కాగా….మరొకరు CBI మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. వీళ్ళిద్దరూ కలిసి స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసే కామెంట్లు కాకరేపుతూ ఉంటాయి. తాజాగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఫోకస్ పెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు కేఏ పాల్. అన్ని పార్టీలు కలిసి వస్తే… స్టీల్ ప్లాంట్ ను కొందాం అన్నారు. నర్సీపట్నంలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన కె ఏ పాల్ అక్కడినించి తిరిగి వెళుతూ మార్గమధ్యంలో మీడియాతో మాట్లాడారు.
దళితులపై దాడి చేస్తే వదిలే ప్రసక్తి లేదు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ తీరుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తించారు.టీడీపీ రధ చక్రాలు ఊడిపోయి జగన్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే బాబు కొడుకు రోడ్ పై పడ్డారు. మంత్రి ఆదిమూలపు సురేష్ పై బరి తెగించి దాడులు చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అనలేదా చంద్రబాబు?దళితులకు మూలాలు లేవు అని బాబు చెప్తాడా అని మండిపడ్డారు. దళితుల్ని భయపెడతావా చంద్రబాబు?రాజధానిలో దళితులు ఉంటే ఇబ్బంది అని చంద్రబాబు అన్నారు. ఇవాళ రూట్ లెవెల్ నుంచి పాలన జరుగుతోంది. రాష్ట్రంలో దళితులపై దాడి చేస్తే వదిలే ప్రసక్తి లేదు. ఆదిమూలపు సురేష్, విశ్వరూప్ అంటే తేలిగ్గా కనపడుతున్నారా చంద్రబాబు? లోకేష్ దళితులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి నాగార్జున డిమాండ్ చేశారు.
వందేభారత్ రైలుపై రాళ్ళు రువ్విన వ్యక్తి.. కారణం ఏంటో తెలుసా?
అతి తక్కువ కాలంలోనే దేశంలో పాపులర్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఎక్కువైంది. రాళ్లదాడికి పాల్పడిన ఓ వ్యక్తిని రైల్వే భద్రతాదళం అరెస్టు చేసింది. భారతీయ రైల్వేల విస్తరణతో సెమీ హైస్పీడ్‌గా పరిగణించబడే వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 14 రూట్లలో నడుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్ర నుంచి ముంబై-పూణె-సోలాపూర్ మార్గంలో నడుస్తోంది. అలాగే ముంబై గాంధీనగర్, ముంబై షిర్డీ రైళ్లు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా బెంగళూరు రైల్వే సెక్షన్‌లోని మలూరు-టికల్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఎప్పుడూ రాళ్ల దాడి జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని రైల్వే భద్రతా దళం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. రాళ్లు రువ్వడానికి అతడు చెప్పిన కారణాన్ని విని భద్రతా బలగాలు ఖంగుతిన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వినందుకు 36 ఏళ్ల వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అరెస్టు చేసింది. అతని పేరు అభిజిత్ అగర్వాల్. పోలీసులు అతడిని విచారించారు. ఈ విచారణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వాలని దేవుడి నుంచి తనకు ఆజ్ఞ వచ్చినంది చెప్పాడు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వడం వల్ల నాకు ఆహారం అందుతోందని పేర్కొన్నాడు. నిందితుడిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 147 కింద కేసు నమోదు చేశారు.
ఎద అందాలు చూపిస్తూ బర్త్ డే ట్రీట్ ఇచ్చిన శివాత్మిక
స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా చాలా రేర్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ క్యారెక్టర్స్ కి తగ్గట్లు గ్లామర్ గా కనిపించాల్సి వస్తే ఎలా కామెంట్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందో అనే భయం ప్రతి స్టార్ హీరో డాటర్ కి ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారు. ఈ స్టీరియోటైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ చిన్న కూతురు ‘శివాత్మిక’. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక, మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ కి తగ్గట్లు పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన శివాత్మిక, ఇటివలే ‘రంగామార్తండ’ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురి పాత్రలో నటించింది. ఈ మూవీలో శివాత్మిక సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి శివాత్మికపై పడింది. రెండు సినిమాలతోనే మంచి ఫ్యూచర్ ఉన్న యాక్టర్ గా పేరు తెచ్చుకున్న శివాత్మిక, ఇప్పటివరకూ తెరపై మాత్రం స్కిన్ షో చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు కొత్త ఫోటోస్ తో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చే శివాత్మిక, తన 23వ ఏట అడుగు పెడుతూనే ట్విట్టర్ లో హీట్ పెంచింది. బ్లూ సారీలో ఫోటోషూట్ చేసిన శివాత్మిక ఎద అందాలని చూపిస్తూ మాగ్నెట్ లా తన వైపు లాగేసింది. ఇంతందాన్ని చూడగానే ఫాలోవర్స్ శివాత్మిక ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందం, అభినయం రెండూ ఉన్న శివాత్మిక పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకునే అవకాశం ఉంది.
రాజమౌళి నార్త్ స్టార్ ని కూడా తెలుగుకి వచ్చేలా చేశాడు
దర్శక ధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఛత్రపతి’. కమర్షియల్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగులో హీరోయిన్ శ్రేయ నటించిన పాత్రని హిందీలో నుష్రత్ బరుచా ప్లే చేసింది. రీసెంట్ గా ఒక జ్యువెల్లరి ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన నుష్రత్ బరుచా, ఎన్టీవీతో స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నుష్రత్ బరుచా మాట్లాడుతూ… “రాజమౌళి, ప్రభాస్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చెయ్యడం చాలా గ్రేట్ ఫీలింగ్ ని ఇచ్చింది. బాహుబలి సినిమా చూసినప్పుడు ఆ స్టొరీ టెల్లింగ్ కి ఫిదా అయిపోయాను. బాహుబలి సినిమా నార్త్ స్టార్స్ అందరినీ తెలుగుకి రప్పిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సెట్స్ లో చాలా ఫన్నీగా ఉంటాడు. వినాయక్ మేకింగ్ చాలా బాగుంది” అంటూ ఛత్రపతి సినిమాలో తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంది. మరి మే 12న ఛత్రపతి సినిమాని నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మంచి కథ, నార్త్ ఆడియన్స్ కి కావాల్సిన సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఛత్రపతి సినిమాలో కావలసినన్ని ఉన్నాయి కాబట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ అందుకోవడం గ్యారెంటీగానే కనిపిస్తోంది.