‘మాస్ మహారాజా’ రవితేజ అంటేనే ఎనర్జీ, స్పీడ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు చిరునామా. కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత రవితేజ తన సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచారు. ఒక్కో సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురితో రొమాన్స్ చేశారు. ఓ సినిమాలో అయితే ఏకంగా నలుగురు హీరోయిన్లు కూడా ఉన్నారు. రవితేజ నటించిన సినిమాల్లో గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
2020లో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, టాన్యా హోప్ నటించారు. ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత వచ్చిన భారీ హిట్ ‘క్రాక్’ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. ‘ఖిలాడీ’లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో దివ్యాంశ కౌశిక్, రాజిషా విజయన్ కథానాయికలుగా కనిపించారు.
రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ధమాకా’లో శ్రీలీల హీరోయిన్‌గా నటించి యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో శృతి హాసన్, కేథరిన్ తెరిసా హీరోయిన్లుగా మెప్పించారు. ‘రావణాసుర’ సినిమాలో అనూ ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్ కనిపించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’లో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.
Also Read: Rinku Singh: టీ20 వరల్డ్ కప్‌కు ముందు.. వివాదంలో చిక్కుకున్న రింకూ సింగ్!
‘ఈగల్’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బోస్ రవితేజ సరసన కనిపించారు. ‘మాస్ జాతర’లో మరోసారి మాస్ మహారాజా సరసన శ్రీలీల హీరోయిన్‌గా కనిపించారు. తాజాగా రిలీజ్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఆశిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. 2020 తర్వాత రవితేజ సినిమాలు అంటే గ్లామర్ హీరోయిన్ల హంగు తప్పనిసరి అన్నట్టుగా ఉంది. కొత్త టాలెంట్ నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేస్తూ.. మాస్ మహారాజా దూసుకెళ్తున్నారు. రవితేజ రాబోయే ప్రాజెక్ట్స్‌లోనూ గ్లామర్ తగ్గదేమో.