బెజవాడకు సూపర్ స్టార్.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మన విజయవాడకు త్వరలోనే రాబోతున్నారు.. ఈ నెల 28వ తేదీన బెజవాడలో పర్యటించనున్నారు. రజనీకాంత్ విజయవాడకు వస్తున్నారంటే ఏదో సినిమా షూటింగ్ కావొచ్చు అని లైట్ తీసుకోకుండి.. ఎందుకంటే.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు రజనీ.. బెజవాడ పొరంకిలోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నటసింహా, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనబోతున్నారు.. మొత్తంగా ఒకే వేదికను పంచుకోబోతున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్, చంద్రబాబు, బాలకృష్ణ. ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సభలో ముఖ్యఅతిధిగా రానున్నర రజనీకాంత్.. ఎన్టీఆర్ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు..
గంజాయి కేసులో పట్టుబడిన ఎస్సై.. ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారీ
గంజాయి కేసులో స్మగ్లర్లు పట్టుపట్టడం సర్వసాధారణం.. కొన్నిసార్లు స్మగ్లర్లతో కుమ్మకయ్యే అధికారులు కూడా పట్టుబడుతుంటారు.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మోతిగూడెం ఎస్సై సత్తిబాబు కూడా గంజాయి కేసులో పట్టుబడ్డారు.. అయితే, ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారు కావడం సంచలనంగా మారింది.. దీంతో, రంపచోడవరం పోలీసుస్టేషన్ లో ఎస్సై పరారీపై కేసు నమోదు చేశారు పోలీసులు.. కాగా, మూడు రోజుల క్రితం చింతూరు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న కారు మోతిగూడెం పోలీసులకు పట్టుబడింది. ఎస్సై సత్తిబాబు.. నిందితులను గంజాయితో పట్టుకున్న కారు వదిలేశారు. ఇదే కారును నెల్లూరులో ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. అయితే, అక్కడ పోలీసులు కూపీ లాగితే.. మోతిగూడం ఎస్సై వ్యవహారం బయటపడింది.. దీంతో, నెల్లూరు పోలీసు అధికారులు స్థానికు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోతిగూడెం ఎస్సై సత్తిబాబును రంపచోడవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ ఎ. ఆర్. నుంచి రెండున్నర సంవత్సరాలు క్రిందట మోతిగూడెం ఎస్సై గా వచ్చిన సత్తిబాబు విచారణ నిమిత్తం ఏఎస్పీ కార్యాలయానికి తీసుకుని రాగా అక్కడి నుంచి పరారైయ్యాడు.
జగనన్నే మా భవిష్యత్‌కు విశేష స్పందన.. టాప్ 5లో ఉంది ఈ ఎమ్మెల్యేలు..
వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జగనన్నే మా భవిష్యత్, నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమానికి మంచి స్పందన ఉండగా.. కొందరు ఎమ్మెల్యేలో ఈ కార్యక్రమంలో విశేష కృషి చేస్తున్నారు.. మెగా పీపుల్స్ సర్వే కి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో.. ఇప్పటికే మెగా సర్వేలో కోటికి పైగా కుటుంబాలను కలిశారు.. అందులో జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 75 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ రావడంతో.. వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, మిస్డ్ కాల్స్ లో మొదటి స్థానంలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఉండగా.. రెండో స్థానంలో మంత్రి విశ్వరూప్, అమలాపురం నియోజకవర్గం ఉంది.. మూడో స్థానంలో ఎమ్మెల్యే కాటసాని రాం రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం ఉండగా.. నాలుగో స్థానంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జమ్మల మడుగు నియోజకవర్గం ఉంది.. ఇక, ఐదో స్థానంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు కైకలూరు నియోజకవర్గం ఉన్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
లోకేష్‌కి ఇదే నా సవాల్.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సవాల్ విసిరారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నారా లోకేష్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు.. కిరాయి గుండాలను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు.. పంచాయితీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేయలేదు.. కానీ, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. తాను కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ చాలెంజ్ చేశారు.. ఇక, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే.. మీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతా.. మర్యాద ఉంటుందా? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి. నారా లోకేష్ ఒక సైకో.. భూకబ్జాలు చేసే అలవాటు నారా వారికి చెల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సాయి ప్రసాద రెడ్డి.. కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయానికి గుడ్ బై చెబుతానన్న ఆయన.. లోకేష్ పిచ్చి కూతలు కూస్తు ఉరురూ తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. మా కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ప్రజలే మమ్మల్ని శిక్షిస్తారన్నారు.. నిరసన తెలపడం మా నాయకులది తప్పే అన్నారు.. ఇక, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన చంద్రబాబు.. అర్హత లేకున్నా ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొని తిరుగుతున్నారు అంటూ మండిపడ్డారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి..
ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చు..
చెన్నై సూపర్ కింగ్స్ తమ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లో నాలుగు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక తమ హోం గ్రౌంగ్ లో ఎస్ ఆర్ హెచ్ పై విజయం సాధించడంపై సీఎస్కే కెప్టెన్ ధోని రియాక్ట్ అయ్యారు. సీఎస్కే యువ పేసర్ మతీషా పతిరనపై ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. నేనా నా కెరీర్ లో చివరి దశలో ఉన్నాను అని ఎంఎస్ ధోని వ్యాఖ్యానించాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు.. కాబట్టి ప్రతీ మ్యాచ్ ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను.. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. వారు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. ఇక ఈ ఏడాది సీజన్ లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు.. కానీ మ్యాచ్ ల్లో మేము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని ధోని అన్నారు.
అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి..? ఏమిటా కథ..
హిందూ సంప్రదాయంలో విశిష్ఠ ప్రత్యేకత ఉన్న అక్షయ తృతీయను హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో మూడో రోజున జరుపుకుంటారు. అక్ష తీజ్ లేదా అక్తిగా పిలిచే ఈ రోజు ప్రతీ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. హిందువులు, జైనులు అక్షయ తృతీయను జరుపుకుంటారు. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ అక్షయ తృతీయను నిర్వహిస్తారు.. ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏంటి? అంటే.. అక్షయ తృతీయ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే రోజుగా నమ్ముతారు.. ఈ రోజున తాము పొందే డబ్బు కానీ, బంగారం కానీ, శాశ్వతంగా ఉంటుందనే భావన ఉంది.. ఇక, ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తాయని.. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించి పెడతాయనే నమ్మకం కూడా ఉంది.. అదృష్టానికి ప్రతీకగా నమ్మే అక్షయ తృతీయను శుభప్రదమైన రోజు.. అందేకే బంగారం లేదా ఏవైనా విలువైన వస్తువుల కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా వస్తుంది. అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 22న వచ్చింది.. అంటే ఈ రోజే.. ఇవాళ ఉదయం 7:49 గంటలకు ప్రారంభమైన అక్షయతృతీయ రేపు అనగా.. ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 07:47 వరకు కొనసాగనుంది..
రంజాన్ సీజన్‌లో బిర్యానీ కొత్త రికార్డు.. హలీమ్ వెనక్కి..! ఏ ఫుడ్ ఎలా అంటే..?
ఏ సీజన్ అయితే ఏంటి.. మాకు కావాల్సిందే బిర్యానీయే అన్నట్టుగా ఉంది హైదరాబాదీలో పరిస్థితి.. ఈ రంజాన్ సీజన్‌లో నూ కొత్త రికార్డు సృష్టించింది.. రంజాన్ సీజన్.. స్పెషల్ వంటకమైన హలీమ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.. అయితే, ఈ సీజన్‌లో మాత్రం బిర్యానీ ఎక్కువ ఆర్డర్లను సొంతం చేసుకుంది.. ఈ రంజాన్ సీజన్‌లో స్విగ్గీలో హలీమ్ కోసం 4 లక్షల ఆర్డర్లు రాగా.. బిర్యానీకి మాత్రం 1 మిలియన్‌కు పైగా వచ్చాయి.. Swiggy తన రంజాన్ ఆర్డర్ విశ్లేషణ నివేదికలో, హలీమ్, చికెన్ బిర్యానీ మరియు సమోసాలు వంటి సాంప్రదాయక ఇష్టమైన వంటకాలను అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలుగా పేర్కొంది. మటన్ హలీమ్ నగరం యొక్క ఫేవరెట్ రకంగా ఉద్భవించడంతో, తొమ్మిది కంటే ఎక్కువ వేరియంట్‌ల కోసం 4 లక్షలకు పైగా ఆర్డర్‌లను హలీమ్ చూసింది. అదనంగా, Swiggy విశ్లేషణ ప్రకారం, malpua, firni మరియు rabdi వంటి పండుగ స్పెషల్‌ల ఆర్డర్‌లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ఇఫ్తార్ విషయానికొస్తే, కరకరలాడే సమోసాలు మరియు భజియాలు ఉపవాసం విరమించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన వస్తువులు, భజియాలకు ఆర్డర్‌లు 77 శాతం పెరిగాయి. పిస్తా హౌస్ హలీమ్, ప్యారడైజ్ బిర్యానీ మరియు మెహఫిల్ వంటి రెస్టారెంట్లు ఇఫ్తార్ సందర్భంగా హైదరాబాద్‌కు ఇష్టమైనవిగా నిలిచాయి.
99 ఏళ్ల వయసులో కన్నుమూత.. వందేళ్ల స్ఫూర్తిదాత..
మన దేశంలో మంచి పేరు సంపాదించిన మల్టీ నేషనల్ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కూడా ఒకటి. వివిధ రంగాలపై ఆ సంస్థ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఆ కంపెనీ సాగించిన అనితర సాధ్యమైన ఈ అద్భుత ప్రయాణంలో ఒక వ్యక్తి పోషించిన పాత్ర సైతం అసమానమైంది. ఆయనే.. భారతదేశంలోని సుప్రసిద్ధ వ్యాపారవేత్త, మహింద్రా గ్రూప్ మాజీ చైర్మన్.. కేశబ్ మహింద్రా. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ. ఇండియా కోసం మహింద్రా.. మహింద్రాతో ఇండియా.. ఈ ఒక్క మాట చాలు. కేశబ్ మహింద్రా గొప్పతనం గురించి చెప్పటానికి. ఎందుకంటే.. మహింద్రా గ్రూప్ కొనసాగిస్తున్న ఈ మహాప్రస్థానం ఆయన ప్రస్తావన లేకపోతే అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అంటే.. ఆ సంస్థతో ఆయనకు అంత అనుబంధం ఉందని అర్థం. మహింద్రా గ్రూప్‌లో కేశబ్ మహింద్రా ఏకంగా 48 ఏళ్లపాటు పనిచేశారు. మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించి చైర్మన్ హోదాలో రిటైర్ అయ్యారు. అసలు.. కేశబ్ మహింద్రా అంటే ఎవరో కాదు. మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కోఫౌండర్ కేసీ మహింద్రా కుమారుడే కేశబ్ మహింద్రా. 1923 అక్టోబర్ 9వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని షిమ్లాలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువు పూర్తయ్యాక.. 1947లో మహింద్రా గ్రూప్‌లో చేరారు. 15 ఏళ్ల అనంతరం.. అంటే.. 1963లో మహింద్రా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి 2012 వరకు కొనసాగారు.
22 వేల మంది అభిమానుల మధ్య సచిన్ టెండూల్కర్ బర్త్ డే వేడుకలు
రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ కి రిటైర్మింట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. అయితే ఇప్పటికే సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. మిగిలిన ప్లేయర్లు కలలో కూడా ఊహించనిన్ని పరుగులు, మ్యాచ్ లు, బౌండరీలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు. క్రికెట్ దేవుడిగా కీర్తి ఘడించిన సచిన్ టెండూల్కర్.. ఏప్రిల్ 24న 50వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. అయితే అంతకంటే ముందుగానే ఏప్రిల్ 22న( ఇవాళ ) 22వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు, పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కి ముందు సచిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగబోతున్నాయి. ఇన్సింగ్స్ 10వ ఓవర్ ముగిసిన తర్వాత గ్రౌండ్ మొత్తం సచిన్.. సచిన్.. నామస్మరణతో మార్మోగిపోతుంది.
అలియాభట్ చెప్పులు మోసిన రణబీర్ కపూర్
ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నిండుకుంది. ఆయన తల్లి పమేలా చోప్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. రణబీర్ కపూర్, అలియాభట్ సాయంత్రం ఆలస్యంగా తన ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రణబీర్ కపూర్‌ను ట్రోల్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రణబీర్ కపూర్, అలియా భట్ ఆదిత్య చోప్రా ఇంటికి వెళుతున్నప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయబడింది. రణబీర్, అలియా క్యాజువల్ లుక్‌లో ఉన్నారు. అలియా లుక్ కూడా చాలా సింపుల్‌గా కనిపించింది. రణబీర్-అలియా ఒకరి వెనుక ఒకరు వెళ్లడం కనిపిస్తుంది. ఈ సమయంలోనే రణబీర్ ఆలియా చెప్పులను ఎత్తుకుని వెళ్లడం రికార్డయింది. దీనిపై రణబీర్ ట్రోల్స్ కు గురవుతున్నారు. వీడియోలో.. అలియా రణబీర్ ముందు నడుస్తూ కనిపించింది. ఆమె మొదట ఇంట్లోకి ప్రవేశించే ముందు బయట మెట్ల దగ్గర తన చెప్పులు వదిలేస్తుంది. వెనకే వచ్చిన రణబీర్ ఆమె చెప్పులు తీసి లోపల పెడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రణబీర్ కపూర్‌పై మండిపడ్డారు. గుడి ముందు రణబీర్ చెప్పులు పెట్టుకున్నాడని అంటున్నారు. అతను ఇలా చేసి ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కదా ఆదిపురుష్ నుంచి మనకి కావాల్సిన స్టఫ్…
విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు, బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ఓం రౌత్ అసలు డైరెక్టర్ కాదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా చేశారు ఏంటి? ఇలాంటి గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా సినిమా ఎలా చేశారు? ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెయ్యకుండా ఉండాల్సింది, రాధే శ్యామ్-సాహూల లిస్టులో ఈ సినిమా కూడా చేరిపోతుంది, అసలు ఇది రామాయణమేనా? ప్రభాస్ ఏంటి అలా ఉన్నాడు? రావణుడు ఏంటి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు? ప్రమోషన్స్ చెయ్యట్లేదు, ఇక సినిమాకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి? ఇది ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ గురించి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వినిపిస్తున్న నెగటివ్ కామెంట్స్. ఇతర హీరోల అభిమానులు కాదు స్వయంగా ప్రభాస్ ఫాన్స్ చేసిన కామెంట్స్ ఇవి. ఆదిపురుష్ సినిమాపైన వేసిన ట్రోల్స్, మీమ్స్ కి అయితే లెక్కే లేదు. ఈ లెక్కలన్నింటినీ తారుమారు చేసింది ఒక్క సాంగ్, ఒక్క మోషన్ పోస్టర్. ఇప్పటివరకూ పాయింట్ అవుట్ చేసిన ప్రతి వేలుని ముడుచుకునేలా చేశాడు ఓం రౌత్, దెబ్బకు సీన్ మారిపోయింది. రీసెంట్‌గా ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్ ప్రీమియర్ షోకి చోటు దక్కించుకోవడంతో… పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన ఆదిపురుష్ సినిమా, తాజాగా నిమిషం నిడివి గల ‘జై శ్రీరామ్’ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. “నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యంసహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్ర నీ నామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్” అంటూ శ్రీరాముడి గొప్పతనాన్ని చాటి చెబుతూ ఈ పాట సాగింది. అజయ్, అతుల్ మ్యూజిక్.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్.. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అక్షయత్రితియ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. విల్లు పట్టుకొని రాముడిలా ఉన్న ప్రభాస్‌ని చూస్తే.. వాల్మీకీ రాసిన రామాయణంలో రాముడు ఇలానే ఉంటారా అనిపించకమానదు. ఈ మోషన్ పోస్టర్ అండ్ జై శ్రీరామ్ సాంగ్ వలన ఇప్పటి నుంచి ఆదిపురుష్ పాజిటివ్ మేనియా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇదే జోష్ ని జూన్ 16 వరకూ మైంటైన్ చేస్తే చాలు ఆదిపురుష్ సినిమా ఇండియన్ థియేటర్స్ ని రామమందిరాలుగా మార్చడం గ్యారెంటీ.