పరోపకారాకిని, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ముంబైలోని మహిం దర్గా, హైదరాబాద్ లోని మక్కా మసీద్, అసెంబ్లీ ఆవరణలో ఉన్న మసీద్ తో పాటు నగరంలోని అన్నీ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రంజాన్ పండగను పురస్కరించుకోని నగరంలో మసీదులు కొత్త కలను సంతరించుకున్నాయి. కాగా.. రంజాన్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Also Read : Al-Qaida : ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ పై దాడి చేస్తాం : ఆల్ ఖైదా
ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సోదరతత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్పూర్తితో ఈద్-ఉల్-ఫితార్ పర్వదిన వేడుకలను కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని సీఎం కేసీఆర్ కోరారు.
Also Read : Sri Hanuman Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు మాయం..
రంజాన్ పండగ సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మీరాలం ఈద్గా ప్రార్థనల సందర్భంగా 20 మంది ఎస్పీలు, 600 మంది పోలీస్ బలగాలను మోహరించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనూ ఆర్ఏఎఫ్, నగర ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని పోలీస్ అధికారులు చెప్పారు.