తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవాళ కొందరు సీనియర్ జడ్జీలను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంది. అయితే, ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా ఉన్నారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్ది సేపటి క్రితం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్ అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట(హసన్ పర్తి) నుంచి కరీంనగర్ కు కొత్త రైల్వే లైన్ ను నిర్మించాలని ఆయన కోరారు. దీంతో పాటు ఈనెల 8న వరంగల్ లో ఖాజీపేట వ్యాగన్…
తెలంగాణ బీజేపీలో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవిని వరించింది. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. జేపీ నడ్డా ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునంలేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడంతో రోజురోజుకు గ్రాఫ్ పడిపోయింది.. త్వరలో జరుగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మరుసటి రోజు తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించి దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు చేయనున్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రూ. 1000 కోట్లు లేదా రూ.2 వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి అప్పుడు రాష్ట్రానికి రావాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల జూలై 7, 8 తేదీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. కాగా.. ఈ క్రమంలో తెలంగాణలో జూలై 8న రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.