హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి గురికావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రెండు రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మన్మాడ్ ట్రైన్స్ ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. ఇక, సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ను (వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి సారి వరంగల్ జిల్లాకు వస్తుండటంతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాని పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా వరంగల్ కు వస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.
ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్లో అక్కడక్కడ వానలు కురుస్తుండగా, గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.