తెలంగాణ బీజేపీలో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవిని వరించింది. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. జేపీ నడ్డా ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Read Also: CM YS jagan Delhi Tour: ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ టూర్.. వీటిపైనే ఫోకస్
దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇకపై వ్యవహరించున్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను వీడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ హస్తం పార్టీలోకి చేరుతున్నారు. అయితే, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతే కాకుండా, రాజగోపాల్ కూడా కొంత కాలంగా బీజేపీ హైకమాండ్‌పై సీరియస్‌గా ఉన్నాడు.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటివి చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Read Also: Delhi Road: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. తప్పిన ప్రమాదం
ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోకుండా ఇలా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. అంతకుమందు.. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలో పార్టీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి.. స్టేట్ చీఫ్ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చింది. అంతేకాకుండా.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.