తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
Read Also: Krithi Shetty : ఆఫర్స్ కోసం సరికొత్త ప్లాన్ వేసిన కృతి శెట్టి..?
ఈ మీటింగ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనపైన చర్చ, బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ సమావేశం టీబీజేపీ హోదాలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. మరోవైపు కిషన్ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ఇది మీటింగ్ కావడం విశేషం. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బాబు మోహన్, బూర నర్సయ్య గౌడ్, ఏవీ.ఎన్.రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమ హాజరయ్యారు.
Read Also: Supreme Court: సుప్రీంకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు ఏపీ న్యాయమూర్తి పేరు రెకమెండ్
అయితే.. అంతకు ముందు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావడంతో ఆయన కమలానాథులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయకు ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు వెల్ కమ్ చెప్పారు. శంషాబాద్ విమానాశ్రం నుంచి కమలానాథులు నేరుగా గచ్చిబౌలిలోని రాడిసన్ హైటల్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.