సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవాళ కొందరు సీనియర్ జడ్జీలను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంది. అయితే, ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ భట్టి ఉన్నారు. వారిద్దరికీ సుప్రీంకోర్టు కొలీజియం పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టుకు రెకమెండ్ చేసింది.
Read Also: BRO: ఎట్టకేలకు బ్రో సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందిగా..
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 2011 అక్టోబర్ 17వ తేదీన గౌహతి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్ 28వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయపరమైన పలు అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రత్యేకించి- పన్నుల చట్టంలో ఉజ్జల్ భూయాన్ నిష్ణాతులు.. అయితే ఆయన గౌహతి హైకోర్టు నుంచి బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ పలు కేసులను డీల్ చేసి అనంతరం పదోన్నతి మీద తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు.
Read Also: Kakani Govardhan Reddy: టీడీపీ చచ్చిపోయింది.. పాడె పట్టడానికి పవన్ ఆరాటపడుతున్నాడు..
ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి జిల్లాలోని మదనపల్లి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి స్వస్థలం. ఆయన 2013 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీగా వెళ్లారు. అయితే, ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 ఉండగా.. ఇప్పుడు 29 మంది పని చేస్తున్నారు. తాజాగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టితో ఈ సంఖ్య 31కి చేరుతుంది. ఇక శుక్రవారం నాడు జస్టిస్ కృష్ణ మురారి పదవీ విరమణ చేయనున్నారు.