పవన్‌పై మంత్రి ఫైర్.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగిపోతున్నారు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కూ ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ కల్యాణ్ నిలబెట్టాలి అంటూ సవాల్ విసిరారు.. పవన్‌తో పాటు లోకేష్ కూడా మొదట ఎమ్మెల్యేగా గెలవాలి అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు, సొంత జిల్లాకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు చేసిందేమీ లేదంటూ మాజీ ముఖ్యమంత్రులపై విమర్శలు గుప్పించారు మంత్రి రోజా.. ఇక, ఓ మహిళకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించడం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు.. తన నాన్న స్థాపించిన పార్టీ పగ్గాలు చేపట్టలేకపోయినా.. చివరకు బీజేపీ పగ్గాలు ఆమె అందుకుంటోందన్నారు. అమె కాదు నందమూరి కుటుంబంలో బాలకృష్ణ సహా ఎవరూ టీడీపీ పగ్గాలు చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా.
ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ టూర్.. వీటిపైనే ఫోకస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. ప్రధాని మోడీతో దాదాపు 1 గంటా 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం. దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రితో మాట్లాడారు.. ఇక, ప్రధానితో సమావేశం తర్వాత కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం తిరిగి రాష్టానికి బయల్దేరాడు.. ఇక, ఈ టూర్‌లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం జగన్.. రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు..
టీడీపీ చచ్చిపోయింది.. పాడె పట్టడానికి పవన్ ఆరాటపడుతున్నాడు..
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చచ్చిపోయింది.. దాని పాదయాత్రకు నలుగురు వ్యక్తులు కావాలని.. పాడె పట్టడానికి ముందు వైపు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు.. ఇక, వెనుకవైపు లోకేష్ బాబు ఉండగా.. నాలుగో వ్యక్తిగా పాడె మోయటానికి పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, లోకేష్ బాబుకు వ్యవసాయ పంటల పేర్లు కూడా తెలియదు.. మరోవైపు చంద్రబాబు నాయుడుకి మతిమరుపు ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేశారు.. ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం కూడా చంద్రబాబు మర్చిపోయాడని సెటైర్లు వేసిన ఆయన.. లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాడు.. గతంలో ఆయన ప్రజలకు ఏమి చేశారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. భారతదేశంలో అత్యధిక పింఛను ఇస్తున్నది మన రాష్ట్రమే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
హైదరాబాద్ కు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ఢిల్లీలోనే బండి సంజయ్
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో బండి సంజయ్ హస్తినలోనే ఆగిపోయినట్లుగా సమాచారం. మరోవైపు.. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వరకు తాను కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతానని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీ తనకు కేటాయించడంతో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహించనున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయాలను అందరూ పాటించాల్సిందేనని ఆయన అన్నారు. ఒక్కరికి ఒక్క పదవే అనేది బీజేపీ విధాన్నాం.. ఈ విధానం మేరకు తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి
తెలంగాణ బీజేపీలో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవిని వరించింది. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. జేపీ నడ్డా ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇకపై వ్యవహరించున్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను వీడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ హస్తం పార్టీలోకి చేరుతున్నారు. అయితే, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతే కాకుండా, రాజగోపాల్ కూడా కొంత కాలంగా బీజేపీ హైకమాండ్‌పై సీరియస్‌గా ఉన్నాడు.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటివి చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
4 రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన..రూ.50,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోడీ జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మరుసటి రోజు తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించి దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగనున్నాయని తెలిసిందే. ప్రధాని మోడీ జూలై 7న ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లనున్నారు. జూలై 7న ఉదయం 10:45 గంటలకు రాయ్‌పూర్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని శంకుస్థాపన చేసి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జబల్‌పూర్-జగ్దల్‌పూర్ జాతీయ రహదారిలోని 33 కిలోమీటర్ల రాయ్‌పూర్-కోడెబోడ్ సెక్షన్‌ను నాలుగు లేనింగ్‌లు, 53 కిలోమీటర్ల బిలాస్‌పూర్-పాత్రపాలి నాలుగు లేనింగ్‌లతో సహా దాదాపు రూ.6,400 కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఎన్‌హెచ్-130 సెక్షన్‌లో ఎన్‌సీఆర్‌ని నాలుగు లేనింగ్‌లు, ఛత్తీస్‌గఢ్ విభాగానికి మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులు, ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్-విశాఖపట్నం కారిడార్ ఉన్నాయి.
బ్యాంక్ కొత్త స్కీమ్..రూ. 5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు మీ సొంతం..
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ ల వల్ల జనాలకు మంచిది లాభాలు వస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధిక వడ్డీ రేట్లు అందించేందుకు ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్. ఈ కొత్త పథకం గడువు జులై 7, 2023తో ముగియనుంది. ఇప్పటికే గడువు ఇప్పటికే చాలా సార్లు పొడిగించిన విషయం తెలిసిందే.. అందుకే ఎక్కువ వడ్డీ కోరుకునే వారు ఈ పథకంలో ఇప్పుడే డిపాజిట్ చేయడం ద్వారా మంచి వడ్డీని పొందవచ్చు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పథకం ద్వారా కస్టమర్లు ఇతర పథకాలతో పోలిస్తే అదనపు వడ్డీ రేట్లను పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు 0.75 శాతం వరకు అదనపు వడ్డీ పొందే వీలుంటుంది. జనరల్ కస్టమర్లతో పోలిస్తే మాములుగా సీనియర్లకు 0.50 శాతం అదనపు వడ్డీ ఇస్తాయి.. ఈ స్కీమ్ వల్ల మరో 0.25 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తుంది.. ఇకపోతే ఈ పథకాన్ని మే 18, 2020న తొలిసారి ప్రవేశపెట్టారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఇందులో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అందువల్ల అధిక రాబడి కోరుకునే కస్టమర్లకు ఈ పథకం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
ఏందయ్యా ఇది.. ఎప్పుడూ చూడలే..! వైరల్ అవుతున్న ఓ ఆట వీడియో..
ఇండియాలో క్రికెట్ తర్వాత ఎక్కువగా క్రేజ్ ఉన్న ఆట.. కబడ్డీ. మనం కూడా చిన్నప్పుడు ఆడే ఉంటాం. ఇప్పుడు దేశ వ్యాప్తంగా యువత కూడా ఆటలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో కబడ్డీ ఆటలో శిక్షణ తీసుకుని.. జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. ఇండియాలో ప్రో కబడ్డీ అని చూసే ఉంటాం. అందులో రాష్ట్రాలకు సంబంధించిన ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి.. జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. అయితే పాకిస్తాన్ లో ఆడే ఓ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఆట అనుకుంటున్నారా..? అక్కడ ఆ ఆటను స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ ఆటను చూస్తే.. నవ్వుకోకుండా ఉండలేరు. కామన్ గా కబడ్డీలో ఏడుగురు ఉంటారు. కానీ ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. ఒక ఆటగాడు మరొక ఆటగాడిని కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు. అయితే మరో ఆటగాడు ఈ పాయింట్‌ని కోల్పొకుండా ప్రత్యర్థి నుంచి కాపాడుకుంటాడు. ఇందులో పంచ్‌లను ఫౌల్ లుగా పరిగణిస్తారు.
మొదటి యాడ్ కే అంత తీసుకుందంటే .. త్వరలోనే తండ్రిని మించిపోతుందేమో
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక యాడ్స్ చేసి .. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గామారిన ఏకైక హీరో మహేష్ బాబు. ఇక యాడ్ చేసినా కూడా మహేష్ సినిమాకు తీసుకొనేంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు. అది మహేష్ రేంజ్. ఇక తండ్రి దారిలోనే కూతురు కూడా నడుస్తోంది. మహేష్ ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతూ పాప పుట్టడం దగ్గరనుంచే ఆమె ఒక చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. ఇక 10 ఏళ్ళ వయస్సులోనే సితార సోషల్ మీడియా పేజీతో పాటు తనకంటూ ఓన్ గా ఒక యూట్యూబ్ ను కూడా స్టార్ట్ చేసింది. ఇక పెరుగుతున్న కొద్దీ సితారను అభిమానులకు దగ్గరచేస్తున్నాడు మహేష్. కూతురు ఫోటోషూట్స్, డ్యాన్స్ వీడియోలను తల్లి నమ్రత చూసుకొంటుంది. ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా కోసం సీతూ పాప మొదటిసారి వెండితెరపై కనిపించింది. ప్రమోషన్ సాంగ్ లో మెరిసి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్న సితార.. తాజాగా ఒక జ్యూవెలరీ యాడ్ లో కనిపించింది. అందమే అసూయపడేలా సితార ఆ ఆభరణాల్లో నిజంగానే రాజకుమారిలా కనిపించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం సితార మొదటి యాడ్ కే కళ్ళు చెదిరే రెమ్యూనిరేషన్ అందుకుందని టాక్. అవును ఈ యాడ్ కోసం సితార అక్షరాలా .. కోటి రూపాయలు అందుకుందట. దీంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి యాడ్ కే ఈ రేంజ్ లో అందుకుంటే.. ముందు ముందు ఈ చిన్నది.. తండ్రిని మించిపోతుందేమో అని కామెంట్స్ పెడుతున్నారు. మరి సితార.. రాబోయే రోజుల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి.
ప్రభాస్ తో కలిసి ఆ సినిమా చూడాలని ఉంది..
పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆర్ఎక్స్ 100 సినిమాతో బాగా పాపులర్ అయింది పాయల్. మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చినంత పాపులరిటి తనకు ఏ సినిమా తో రాలేదు..అయినా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ.తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తుంది ఈ భామ.. ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.వరుస ఫోటో షూట్ లతో తెగ రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ ఒక వ్యక్తితో ప్రేమలో కూడా ఉంది.అతని తో ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.. అతని తో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.తన రొమాంటిక్ ఫోటోల తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది పాయల్. ప్రస్తుతం తాను మంగళవారం అనే సినిమాలో నటిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయింది. టీజర్ ప్రేక్షకులందరిని ఎంత గానో ఆకట్టుకుంది. మంగళవారం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అని చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక టీజర్ విడుదలైన సందర్భంగా తను తన ఫాలోవర్స్ తో కాసేపు చాట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.సినిమా గురించి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిక గా సమాధానం ఇచ్చింది.అంతేకాకుండా తన పర్సనల్ విషయాల ను కూడా వెల్లడించింది.అలా ఓ నెటిజన్ ప్రభాస్ గురించి అడగటంతో తనకు ప్రభాస్ తో మంగళవారం సినిమా చూడాలని ఉందని తన మనసులోని మాటను తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె పంచుకున్న స్టోరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.తాను నటించిన మంగళవారం సినిమా విజయం సాధిస్తే ఆమెకు మళ్ళీ వరుస గా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.