పవన్ పార్టీ పోటీచేసేది ఆ సీట్లలోనే.. ఆ సంఖ్య మాత్రం దాటదు..
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తేల్చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. పవన్‌తో పాటు చిరంజీవిపై కూడా కామెంట్లు చేశారు.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, తాను అందించిన పాలన మళ్లీ తెస్తామని చెప్పాలి.. ఆ దమ్ము నీకు ఉందా పవన్? అంటూ సవాల్ చేసిన ఆయన.. అలా చెప్పు కోవటానికి సిగ్గు పడవా ? అంటూ ఎద్దేవా చేశారు. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చ గొట్టి, వాళ్ళని పొట్లం కట్టి చంద్రబాబుకి అమ్మెస్తావ్ అని తెలుసు అంటూ మండిపడ్డారు. ఇక, పవన్ పోటీ చేసేది 25 నుంచి 30 సీట్లు లోపు మాత్రమేనని జోస్యం చెప్పారు. పార్లమెంట్ కి ఒక సీటు చొప్పున పోటీ చేసి సీఎం అవుతావా? పవన్ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. పవన్ వి దగాకోరుమాటలు.. సినిమా గ్లామర్ తో పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ దుయ్యబట్టారు పేర్ని నాని.. ఇకనైనా చిరంజీవిని చూసి నేర్చుకో అంటూ హితవుపలికిన ఆయన.. రాజకీయాలు నాకు సరిపడవు అని చిరంజీవి సినిమాలు చేసుకుంటున్నారు.. నువ్వుకూడా అదే చేసుకుంటే బెటర్ అని హితబోధ చేశారు. వైసీపీ వాళ్లను చేర్చుకోను అని చెప్పి.. ఇప్పుడు బస్టాప్ లో టాటా మ్యాజిక్ మాదిరి ఎవరు వస్తే వాళ్లను ఎక్కించుకు వెళ్తాం అని చెప్పు అంటూ ఎద్దేవా చేశారు. తెనాలిలో నాదెండ్ల పోటీ చేస్తారన్నారు.. గుంటూరులో మిగతా సీట్లలో పోటీ చేయరా? అని ప్రశ్నించారు. స్టీల్ ఫ్యాక్టరీ గురించి మోడీ, అమిత్ షా దగ్గర నోరు ఎత్తడం లేదు.. ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఢిల్లీలో ఎందుకు మాట్లాడవు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
విసన్నపేట భూములపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తాం.. ఏంటి ఈ దోపిడి..?
విసన్న పేట భూముల మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటకు చేరుకున్న పవన్.. వివాదాస్పద భూములను పరిశీలించారు.. సర్వే నెంబర్ 195/2లోని 609 ఎకరాలను అధికార పార్టీ నాయకుల అండతో ప్రైవేట్ వ్యక్తులు హస్తగతం చేసుకున్నారని ఇప్పటికే లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది జనసేన పార్టీ.. మంత్రి అమర్నాథ్, ఆయన అనుచరులు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.. అయితే, జనసేన ఆరోపణలకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విస్సన్నపేట భూముల్లో తనకు సెంటు స్థలం ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. తన ప్రమేయం కానీ.. భూమి ఉన్నట్టు నిరూపించినా జనసేనకు రాసిచ్చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం విదితమే. ఇక, విసన్నపేటలో భూములను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారంపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తాం అని ప్రకటించారు.. విస్సన్నపేటలో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. వోల్టా చట్టం తుంగలో తొక్కారని విమర్శించారు. ఉత్తరాంధ్ర మీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. ఉత్తరాంధ్ర భూములు మీదే ప్రేమ అని ఆరోపించారు. ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. విస్సన్నపేటకు రావడానికి ఇరుకు రోడ్ ఉంది.. కానీ, వీరి రియల్ ఎస్టేట్ కి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు పవన్ కల్యాణ్. మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కాదు.. నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే అడుగుతున్నాను.. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం.. కొండలను పిండి చేశారు, ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
టీటీడీ హైలెవల్ కమిటీ కీలక నిర్ణయాలు.. నడకదారిలో ఇకపై ఇవి కుదరదు..
తిరుమల నడకదారిలో చిన్నారి మృతి తీవ్ర కలకలం రేపింది.. దీంతో, అలర్ట్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.. దీని కోసం ఈ రోజు టీటీడీ హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది.. ఈ మధ్య నడక దారిలో చిన్నారులపై చిరుత దాడులపై చర్చించారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. 40 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడులు చేసింది.. భవిష్యత్త్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం అన్నారు. దీని కోసం అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో చిన్న పిల్లలను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.. ఇక, పెద్దవారిని అలిపిరి నడకమార్గంలో రాత్రి 10 గంటల వరకు అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నడకమార్గంలో వెళ్లే ప్రతీ భక్తుడికి చేతికర్రను అందిస్తాం అని వెల్లడించారు టీటీడీ చైర్మన్. ఇక, తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తాం అని తెలిపారు కరుణాకర్‌రెడ్డి.. భక్తులకు భధ్రత కల్పించేందుకు ఫారెస్ట్ విభాగంలో అదనపు సిబ్బందిని నియమిస్తాం అన్నారు. భక్తులు వన్యప్రాణులకు ఆహారం అందించడంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. నడకమార్గాలలో హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్థాలను భయట పడేయకుండా నిషేధిస్తూన్నాం అని స్పష్టం చేశారు. నడకమార్గంలో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.. డ్రోన్ కెమెరాలను అవసరానికి తగ్గట్టుగా వినియోగిస్తాం.. నడకదారికి ఇరు వైపుల ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తాం.. 24 గంటల పాటు అందుబాటులో వుండేలా ఫారెస్ట్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. నడకదారిలో పెన్సింగ్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..
34 మంది తెలంగాణ పోలీసులకు కేంద్ర సేవా పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు ఈ పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలు అందించనున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, పది మందికి పోలీస్ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు అందించనున్నారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్ కుమార్, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ నేత సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీకి సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే..!
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కైతాల్ లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ‘జన్ ఆక్రోష్ ర్యాలీ’లో సుర్జేవాలా పాల్గొని మాట్లాడారు. ‘‘ఉద్యోగం ఇవ్వకండి, కనీసం ఉద్యోగంలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి. బీజేపీ, జేజేపీలో నాయకులు రాక్షసులు. బీజేపీకి ఓటేసి, వారికి మద్దతిచ్చే వారు కూడా రాక్షసులే. ఈ రోజు నేను ఈ మహాభారత భూమి నుండి శపిస్తున్నాను.’’ అని సుర్జేవాలా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ.. తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. “పదేపదే ఎన్నికల ఓటములు కాంగ్రెస్‌ను అప్రస్తుతంలోకి నెట్టాయి. ” అని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. యువరాజు (రాహుల్ గాంధీ)ను పదేపదే లాంచ్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను, జనార్ధన్ ను దూషించడం ప్రారంభించిందని ఆరోపించారు. ‘‘ప్రధాని మోడీ, బీజేపీ వల్ల అంధత్వానికి గురైన కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా చెప్పిన మాటలు వినండి’’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం.. వర్ష బీభత్సంతో 29 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి జనాలు అతలాకుతలం అవుతున్నారు. గత 24 గంటల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారు. తాజాగా.. సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. వర్షాల దాటికి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంలోకి దూసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోగా.. ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగుర్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా.. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో ఆ ప్రభావం అలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాల ధాటికి 257 మంది మృతి చెందారు. 32 మంది తప్పిపోగా.. 290 మంది గాయపడ్డారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి.. సిమ్లాలో శివ మందిర్ నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం వెళ్లిన భక్తులు.. మందిరం కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సీఎం తెలిపారు.
ఏంటి బాస్.. వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటున్నారు..
విరాట్ కోహ్లీ సారథ్యంలో యజ్వేంద్ర చాహాల్ టీమిండియాలో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చాడు. అయితే అతనికి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా చాహాల్ ఆడేది అనుమానంగానే ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 5 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇక, కుల్దీప్ యాదవ్ 4 మ్యాచుల్లో 6 వికెట్లు తీసి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 4 ఓవర్లలో యుజ్వేంద్ర చాహాల్ 51 రన్స్ సమర్పించుకున్నాడు. మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ ఒక్క ఓవర్లో 8 పరుగులే ఇచ్చాడు. టీ20 ఇన్నింగ్స్‌లో 50కి పైగా రన్స్ ఇవ్వడం యజ్వేంద్ర చాహాల్‌కి ఇది నాలుగో సారి. అయితే, మరో ప్లేయర్ యంగ్ సంజూ శాంసన్, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గత ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 77 పరుగులు మినహాయిస్తే.. ఆ తర్వాత ఆడిన 22 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. వెస్టిండీస్ తో తొలి టీ20లో 12 పరుగులు చేసి సంజూ శాంసన్.. రెండో మ్యాచ్‌లో 7 పరుగులు, మూడు, నాలుగో మ్యాచుల్లో శాంసన్ కి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఇక, ఫైనల్ మ్యాచ్‌లో 9 బంతుల్లో 13 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహాల్ ప్రదర్శన చూస్తుంటే.. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో స్థానం సంపాదించుకోవడం డౌట్ గానే ఉంది. ఇక, ఈ సంవత్సరం జరిగే వన్డే వరల్డ్ కప్ లోనూ వీళ్లు ఆడడం కష్టమే.. ఎందుకంటే కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, అతనితో పాటు ఇషాన్ కిషన్‌కి వికెట్ కీపర్‌గా టీమ్‌లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది.
రూ.15 వేల పెట్టుబడితో రూ.4 వేలు పొందే అవకాశం.. ఈ బిజినెస్ తో అదిరిపోయే లాభాలు..
ఈరోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి.. సొంతంగా బిజినెస్ చేసి డబ్బులను సంపాదించాలని అనుకొనేవారికి ఎన్నో బిజినెస్ లు అందుబాటులో ఉన్నాయి..మీరు కూడా ఈ జాబితాలో ఉంటే మేము అందించే ఈ బిజినెస్ ఐడియాను ఒక్కసారి చూడండి.. ఈ బిజినెస్ తో తక్కువ ఖర్చుతో విపరీతమైన లాభాలను ఆర్జించవచ్చు. అటువంటి వ్యాపార ఆలోచనను మీకు తెలియజేస్తున్నాం.. అదేంటంటే.. అరటికాయ పొడి వ్యాపారం.. ఈ వ్యాపారంలో ఎక్కువ ఖర్చు ఉండదు. రూ.10,000-రూ.15,000 రూపాయలతోనే అరటిపండు పొడి వ్యాపారం ప్రారంభించవచ్చు. అయితే ఈ పొడిని తయారు చేయడానికి మీకు రెండు యంత్రాలు అవసరం అవుతాయి.. ఈ పొడిని తయారు చెయ్యడం కోసం మీరు ముందుగా పచ్చి అరటిపండ్లను సేకరించాలి.. ఈ అరటిని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటిని పీల్ చేసి వెంటనే సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుది. దీని తర్వాత అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఓవెన్‌లో ముక్కలను ఉంచండి. 60° C వద్ద దానికి 24 గంటలు ఉంచండి. దీంతో అరటిపండు ముక్కలు పూర్తిగా ఆరిపోతాయి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడిగా వచ్చేవరకు గ్రైండ్ చేసుకోవాలి..
‘జైలర్ 2’ ప్రకటించిన డైరెక్టర్.. రజినీ- విజయ్ కాంబోలో..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్ లో నటించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. బీస్ట్ లాంటి పరాజయాన్ని అందుకున్నాక నెల్సన్ పై పెద్దగా అంచనాలు లేవు.. ఇంకోపక్క రజినీ సైతం ప్లాప్ ల్లో ఉన్నాడు. వీరి కాంబో నుంచి వచ్చిన చిత్రం.. ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు భయపడ్డారు. కానీ, మొదటి షో రిజల్ట్ రాగానే ఫ్యాన్స్ థియేటర్ లో రచ్చ చేయడం మొదలుపెట్టారు. రజినీ స్వాగ్, స్టైల్ వేరే లెవెల్ అయితే.. ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్.. అనిరుధ్ కొట్టిన బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక బీస్ట్ తరువాత ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపడిన నెల్సన్.. ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నెల్సన్.. జైలర్ సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు. ” జైలర్ పార్ట్ 2 కు ప్లాన్ చేస్తున్నా.. జైలర్ మాత్రమే కాదు నేను డైరెక్ట్ చేసిన కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు కూడా పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నా.. వీటితో పాటు జైలర్ కూడా పార్ట్ 2 ఉంటుంది. ఈసారి ఈ కథలు అంతకు మించి ఉంటాయి అని చెప్పాడు. అంతే కాకుండా రజినీకాంత్- విజయ్ ల కాంబో లో ఒక సినిమా చేయాలని నా కోరిక. అది త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు జైలర్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ను పట్టేందుకు రంగంలోకి అనుపమ్ ఖేర్..
రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టువర్టుపురం అనే గ్రామంలో దొంగల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు గా ఎలా మారాడు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎంత వణికించాడు? అనే విషయాలను ఆధారంగా చేసుకుని టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సాధారణంగానే నిజ జీవిత ఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తాయి. దానికి తోడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తూ ఉండడంతో ఒక్కసారిగా అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఆ అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఈ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తుండగా ఇప్పుడు మరొక స్టార్ యాక్టర్ ఈ సినిమాలో భాగమైనట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజపుత్ పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ కేర్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భారద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జిషుసేన్ గుప్తా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ విస్స డైలాగ్స్ అందిస్తున్నారు.. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజ్ పుత్ పాత్రలో నటిస్తున్న అనుపమ్ కేర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో ఆయన గంభీరంగా కనిపిస్తున్నారు.. అక్టోబర్ 20వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 17వ తేదీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిరంజీవి పై వస్తున్న ఆ రూమర్స్ ను ఖండించిన బేబీ దర్శకుడు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ పై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘భోళా శంకర్’ సినిమా విడుదలకు ముందు నిర్మాత అనిల్ సుంకర వద్ద చిరంజీవి తన పారితోషికం అంతా వసూలు చేశారని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. చిరంజీవి పారితోషకం ఇవ్వడానికి నిర్మాత అనిల్ సుంకర తనకు వున్న ల్యాండ్ ను తనకా పెట్టి మరి డబ్బులు అడ్జస్ట్ చేసారని సోషల్ మీడియాలో ఈ రూమర్ తెగ ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్ ని ఖండిస్తూ చిరంజీవి వీరాభిమాని, ‘బేబీ’ సినిమా దర్శకుడు అయిన సాయి రాజేష్ చాలా క్లియర్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. చిరంజీవి గారి గురించి ఆరోపణలు చేయడం ఆపండి, సినిమా బాగోలేకపోతే బాగోలేదు అని చెప్పండి, అంతే కానీ సినిమాలో నటించిన చిరంజీవి గారి మీద లేనిపోనీ నిందలు వేయొద్దు అంటూ ఆయన రాసుకొచ్చారు. అలాగే ఈ వార్తలపై సాయి రాజేష్ బాగా మండిపడ్డారు.. మేము మెగాస్టార్ చిరంజీవి గారి ఆఫీస్ లో ఉన్నప్పుడు అనిల్ సుంకర గారు వస్తే ఆయన్ని వెయిట్ చేస్తున్నాడని తెలిసీ ఆయనను పిలిచి పైకి రాగానే ఆయనే ఐరెన్ సోఫా జరిపి మరీ కూర్చోబెట్టారు. పని మనిషి తీసుకొచ్చిన కాఫీని స్వయంగా మా ముగ్గురికి అందించారు. నిర్మాతలకి ఆయనిచ్చే రెస్పెక్ట్ అలాంటిది.ఆయనపై వస్తున్న వార్తలని చూసి ఎంతో బాధతో నేను అనిల్ గారు దగ్గర పని చేసే ఒక వ్యక్తికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను. మా చిరంజీవి గారు వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికి తెలుసు.మా చిరంజీవి గారిని చూసి నేను గర్వపడుతున్నాను అంటూ సాయి రాజేష్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.