Minister KTR: నిజామాబాద్ ఐటీ టవర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు.
Mallu Ravi: గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. సమాజంలో మార్పు కోసం అన్ని వర్గాల కోసం గద్దర్ పాటలు రాసారని గుర్తు చేసుకున్నారు.
ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. చట్ట సభలపై కేసీఆర్ కి నమ్మకం సన్నగిల్లింది.. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్.. తాజాగా నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధం చేసింది.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు( సోమవారం ) ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి.
దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.
ప్రజా గాయకుడు గద్దర్ తన స్వరంతో కోట్లాది మంది ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిల్చారు. చావుకు దగ్గరలో ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో కూడా పాటను మాత్ర వదల్లేదు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి ఐసీయూలోనూ పాటలు పాడారని మీడియాకు చెబుతూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయనకు గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని.. కుటుంబసభ్యులు వెల్లడించారు.
బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీలో నేను వస్తానోరానో తెలియదు అని వ్యాఖ్యనించాడు. వచ్చే సభలో నేనైతే ఉండకపోవచ్చు అనుకుంటున్నా.. నేను ఉన్నా, లేకున్నా తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని రాజాసింగ్ తెలిపారు.