తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. లక్ష లోపు రైతు రుణాలన్నీ మాఫీ
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఇవాళ (సోమవారం) ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 16.16 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయినట్లు పేర్కొన్నారు. అయితే, సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీలను మాఫీ చేసినందుకు తెలంగాణలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఉత్తర్వులతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక, రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఇవాళ 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరపున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. రైతుల తరపున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. ఇవి రుణమాఫీ కింద బ్యాంకులకు చేరతాయని తెలిపారు.
ఏపీలోని ఆ గ్రామంలో వింత ఆచారం.. వర్షాల కోసం పాండవుల వేషం వేసి..
భారత సమాజం భిన్న సంస్కృతుల సమ్మేళనం.. దేశంలో భిన్న మతాలు, కులాలు, సాంస్కృతిక భిన్నత్వం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించింది.. ఇక, ఇవి రాష్ట్రాలను, ప్రాంతాలను.. గ్రామాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి.. వింత ఆచారాలు కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి.. కానీ, అలా చేస్తే.. మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసంగా ఉంది.. దీంతో.. చాలా మంది వారి విశ్వాసాలను గౌరవిస్తారు.. ఇక, వర్షాల కోసం కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజలు చేస్తుంటారు.. కాకినాడలోని జగ్గంపేట మండలం కాండ్రేగులలో వర్షం కోసం గ్రామస్తులు వింత ఆచారం అనుసరిస్తారు. ఆ గ్రామంలో వర్షాలు కురవాలంటూ చిన్నారులకి పాండవులు వేషం వేసి.. భాజ భజంత్రీలతో.. పువ్వులు, పాలు, ప్రసాదాలతో ఊరేగింపుగా కొండపైకి వెళ్లారు గ్రామస్తులు.. కొండమీద పూజలు చేసి నైవేథ్యం పెట్టి తీసుకుని వెళ్లిన పాలతో ప్రసాదం తయారుచేసి అందరికీ పంచారు గ్రామస్తులు.. ఇలా చేయడాన్ని పాల పొంగు అంటారని.. పూర్వం వర్షాల కోసం ఈ విధంగా చేసే వారాని గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తంగా చిన్నారులకు టవాళ్లు లుంగీలుగా కట్టి పాండవుల వేషం వేసి పూజలు నిర్వహించారు.. గ్రామంలో భాజ భజంత్రీలతో తిరిగారు.. వారిపై గ్రామస్తులు బకెట్లు, బిందెలతో నీళ్లు పోశారు. వేషాలు వేసిన చిన్నారులు ఎంజాయ్ చేశారు.. ఇక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కోసం కప్పలను ఊరేగించడం.. కప్పలకు పెళ్లి చేయించడం లాంటి ఆచారాలను పాటించే విషయం విదితమే.
ప్రపంచ స్థాయి విద్యాబోధన టార్గెట్.. సీఎం కీలక ఆదేశాలు
విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో చర్చించారు.. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు.. ప్రపంచ స్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని స్పష్టం చేసిన సీఎం జగన్.. దీనికి ముందుగా విస్తృతంగా అధ్యయనం, కసరత్తు చేయాలన్నారు. ఉన్నత విద్య టీచింగ్, లెర్నింగ్‌లో ఏఐ వినియోగించాలన్నారు సీఎం వైఎస్ జగన్. అయితే, ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై కార్యాచరణను సీఎం వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా వివరించారు అధికారులు. ఉన్నత విద్య విద్యార్థులకు కోర్సు చివరలో ఏఐ ప్రాథమిక అంశాలు బోధించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏఐపై పరిశోధన కోసం యూనివర్శిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు చేయనున్నారు. బోధన, పరిశోధన, మూల్యాంకనంలో ఏఐ టూల్స్ వినియోగం ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ ఫౌండేషన్ కోర్సు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బైలింగువల్, డిజిటల్ కంటెంట్ రూపంలో కోర్సులు తీసుకురానున్నారు. ఏఐ, అప్లికేషన్ల వినియోగంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అభివృద్ధి చేస్తారు. యూనివర్శిటీలో మూడు రకాల జోన్లను అభివృద్ధి చేయనున్నారు. కంప్యూటర్ విజన్ జోన్, ఇమేజ్ ప్రాససింగ్ జోన్ మెటావర్స్ లెర్నింగ్ జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు.
పవన్‌పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. వెంట్రుక కూడా పీకలేకపోయారు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విసన్నపేట భూములను పరిశీలించిన పవన్.. వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఆయన.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. పవన్ కల్యాణ్ విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారు అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. రుషికొండ పేలిపోయి జగన్మోహన్ రెడ్డి అందులో కూరుకుపోవాలనే పవన్ వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవి అంటూ దుయ్యబట్టారు.. రుషికొండలో ఎటువంటి ఉల్లంఘణలు కనిపించక వెనక్కి తిరిగొచ్చారన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ వంటి రియల్ లైఫ్ హీరోను చూసి.. ఈర్ష్య ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలి..? అని ప్రశ్నించారు. ప్రజానాయకుడైన జగన్ స్థాయిలో కథా నాయకుడైన పవన్ ను ఒకే స్థాయిలో జనం చూస్తారు అనుకుంటే అమాయకత్వమే అవుతుందంటూ సెటైర్లు వేశారు. ఇక, పవన్ కల్యాణ్ కీచక గురువుగా మారాడు అంటూ ఫైర్ అయ్యారు గుడివాడ అమర్నాథ్.. యువకులను సినిమా అనే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి విచ్చలవిడిగా వాడుకుంటున్నారన్న ఆయన.. నాయకులు, కార్యకర్తలను మూట కట్టేసి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ సిద్ధం అయ్యారని విమర్శించారు. నాపై, మా ప్రభుత్వం మీద దోపిడీ దారులు అనే ముద్ర వేసేందుకు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటూ తిప్పికొట్టారు. తరతరాలుగా రాజకీయాల్లో ఎదిగిన వాళ్లం.. మేం ప్రజలకు, ప్రభుత్వానికి కస్టడీయన్ గా వ్యవహరిస్తోందన్నారు. విశాఖ భూ అక్రమాలపై త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు ఉంటాయని ప్రకటించారు. సిట్ నివేదిక ఆధారంగా సుమారు 76 మంది ప్రమేయం నిర్ధారణ అయ్యింది. వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 2014-19మధ్య రాష్ట్రంలో కొండలను దోపిడీ చేసిన అనకొండలు ఇప్పుడు ఎందుకు కొండల గురించి మాట్లాడుతున్నారు..? అంటూ నిలదీశారు. బెజవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం బయటపడితే పవన్ కల్యాణ్ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా..? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు.. వైసీపీలో తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరవు అనుకున్నవాళ్లే జనసేనలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే
నేడు (సోమవారం) కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి అమృత నగర్ తండా.. దీన్ దయాల్ నగర్.. జింకలవాడ.. హెచ్పి రోడ్.. సమతా నగర్.. వెంకటేశ్వర నగర్.. భవాని నగర్.. కార్మిక నగర్.. శివాలయం హాట్స్ మీదుగా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేసిన అభివృద్దిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఒకప్పుడు తండాల్లో మంచినీటికి ఎంతో ఇబ్బంది పడే వారమని.. ఇప్పుడు గల్లీ గల్లీకి రోడ్లు వేసి.. మంచినీరు అందించి 24 గంటలు విద్యుత్తు సదుపాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాలు అందిన లబ్ధిదారులు ఈ పాదయాత్రలో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును సన్మానించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఫతేనగర్ లోని నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన దీన్ దయాల్ నగర్.. అమృత నగర్ తండా, కార్మిక నగర్ మొదలగు ప్రాంతాల్లో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు అప్లై చేసుకున్నారని.. అయితే అతి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించే బాధ్యత నాదని వారికి హామీ ఇచ్చారు.. 60 ఏళ్లుగా ఎంతో మంది పాలకులు పరిపాలించినా కేవలం 9 ఏళ్లలో ఎన్నో సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని పొరపాటున అధికారం వేరే పార్టీలకి అప్పజెప్పితే రాష్ట్రం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హితబోధ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నేడు హైదరాబాద్ అమ్మలా అందరిని ఆదుకుంటుందని ఆయన గుర్తు చేశారు…
రామేశ్వర్తో కలిసి భోజనం చేసిన రాహుల్.. ఫొటోలు వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆజాద్‌పూర్ మండి కూరగాయల విక్రేత రామేశ్వర్‌ను కలిశారు. అనంతరం రామేశ్వర్‌తో కలిసి రాహుల్ భోజనం చేశారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో రామేశ్వర్ కూరగాయలు అమ్ముతున్న వీడియో వైరల్ అయింది. టమాటాలను పెద్దమొత్తంలో కొనేందుకు తాను మండికి వచ్చానని.. అయితే ధర ఎక్కువగా ఉందని, అందుకోసం కొనలేనంటూ ఏడుస్తూ రామేశ్వర్ వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా.. రాహుల్‌ను కలవాలన్న కోరికను కూడా ఆ వీడియోలో తెలిపాడు. రాహుల్ గాంధీ రామేశ్వర్‌ను కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా.. రామేశ్వర్ జీ సజీవమైన వ్యక్తి అని రాహుల్ తెలిపారు. కోట్లాది భారతీయుల సహజసిద్ధమైన స్వభావానికి సంబంధించిన సంగ్రహావలోకనం అతనిలో కనిపిస్తుందని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో ముందుకు సాగే వారు నిజంగా ‘భారత్ భాగ్య విధాత’ అని రాహుల్ గాంధీ రాశారు. మరోవైపు గత వారం రామేశ్వర్ ను కలిసేందుకు రాహుల్ గాంధీ.. ఆజాద్‌పూర్ మండికి వెళ్లారు. అక్కడ కూరగాయల విక్రేతలను కలుసుకుని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లిన సమయంలో రామేశ్వర్ లేడు. అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ అక్కడికి వచ్చిన విషయం తెలుసుకుని.. రాహుల్‌ను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో సోమవారం రామేశ్వర్ ను తన ఇంటికి పిలిచి అతనితో డిన్నర్ చేసారు రాహుల్ గాంధీ.
ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో చార్‌థామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు. మరోవైపు డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో ఇప్పటివరకు 60 మంది మరణించగా, 17 మంది గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్సంతో కొండ చరియలు విరిగిపడడంతో పాటు.. డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్, చంపావత్, ఉధం సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఆగస్టు 14, 15 తేదీల్లో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టుగా అధికారులు వివరించారు. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో.. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తు్న్నాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశమున్నందున అధికారులు రహదారులను మూసివేశారు.
రోహిత్ శర్మకు ఇంతకు తోడు దొరికేనా..?
భారత జట్టుకు ఓపెనర్ల సమస్య చాలా కాలం నుంచి వేధిస్తుంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడీ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. అయితే కాలక్రమంలో ధావన్ ఫామ్ కోల్పోవడంతో, కేఎల్ రాహుల్ సత్తా చాటడంతో గబ్బర్ క్రమేనా కనుమరుగైపోయాడు. కేఏ రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధావన్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటించడంతో.. సిరీస్, సిరీస్‌కు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా శుభ్‌మన్ గిల్ తెరపైకి వచ్చాడు. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక, సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆ తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత క్లిష్టమైంది.
ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ… అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ నిజ జీవిత వయసున్న పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో హై యాక్షన్ ఉంటుంది. అనిల్ రావిపూడి మార్క్ మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో అనేక మంది కీలక నటీనటులు నటిస్తున్నారు. భగవంత్ కేసరిలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన ఆయన అప్పుడే సినిమా షూటింగ్ ముగించేశాడు. తాజాగా అర్జున్ రాంపాల్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముగించినట్లుగా అధికారిక ప్రకటన రావడంతో ఇంత త్వరగా షూటింగ్ ముగించేస్తున్నారు ఏంటి అనిల్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాకి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా నందమూరి బాలకృష్ణ చూపిస్తానని ముందు నుంచి అనిల్ రావిపూడి చెబుతూ ఉండడంతో నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో సైతం సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. మరి అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకోబోతోంది అనేది వేసి చూడాల్సి ఉంది.
ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ నుంచి స్టార్ కమెడియన్ గా ఆది మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆది ఒక పక్క స్టార్ కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క సినిమాలకు డైలాగ్స్ అందిస్తున్నాడు. ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క షోలతో రెండు చేతుల సంపాదిస్తున్న ఆది పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా హైపర్ ఆది ఒక యాంకర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ యాంకర్ వర్షిని అంటూ ప్రచారం కూడా సాగింది. అయితే ఈ విషయంపై స్పందించిన వర్షిని అందులో నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇక తాజాగా హైపర్ ఆది ఒక షోలో తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఆమె పేరు విహారిక అని తెలిపాడు. హైపర్ ఆది.. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ప్రతివారం పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రతివారం ఒక థీమ్ స్పెషల్ గా ఈ షో ను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈసారి ఓ రెండు మేఘాలు ఇలా అంటూ ఒక కాన్సెప్ట్ ను తయారు చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో హైపర్ ఆది తన లవర్ ను తీసుకురావడం విశేషం. అయితే ఆమె నిజంగా ఆది లవరా..? లేక పబ్లిసిటీ స్టంటా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి విహారిక.. నిజంగా హైపర్ ఆది ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడా..? ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.