తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక భేటీ
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అర డజన్ కు చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతారనే సంకేతాలు వస్తూన్న నేపథ్యంలో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, వేముల వీరేశం పార్టీలోకి వస్తే నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ ఏం చేయాలి.. వేముల వీరేశం టికెట్ ఆశిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలోకి ఆహ్వానించి నకిరేకల్ నుంచి బరిలోకి దింపితే.. ఎలా వ్యవహరించాలి… ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం మండలాల వారిగా కూర్చుని మాట్లాడుకుందాం.. అదే రోజు నిర్ణయం తీసుకుందాం అని ఆయన పేర్కొన్నారు.
మెడికో మృతి కేసులో కొత్త ట్విస్ట్.. అసలు విషయం వేరే ఉంది..!
విశాఖపట్నంలో ఓ లాడ్జిలో మెడికో అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది.. కేరళకు చెందిన ఎంఎంబీఎస్ విద్యార్థిని రమేష్ కృష్ణ విశాఖలో ఆత్మహత్య చేసుకుంది.. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోటు కూడా రాసింది.. ఇక, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు.. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసులో పురోగతి సాధించినట్టు చెబుతున్నారు.. ప్రియుడుతో ఏర్పడ్డ మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు.. కాగా, ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన మెడికో రమేష్ కృష్ణ(25).. అంతకు ముందే ఇండోర్ లో ఉన్న ప్రియుడుని కలిసి వచ్చినట్టు తెలుస్తోంది.. అయితే, చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది రమేష్ కృష్ణ.. ఆమె స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం.. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ.. విశాఖపట్నం నుండి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్ నేపథ్యంలో.. విశాఖలోని దాబా గార్డెన్ లోని ఓ లాడ్జిలో దిగింది.. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది..
టీటీడీ ఈవోపై దుష్ప్రచారం.. అసలు విషయం అదికాదంటున్న ఉద్యోగ సంఘాలు
నిజం నిద్ర లేచే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందట.. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిస్థితి కూడా అలాగే తయారైంది.. ఏది వైరల్, ఏది రియల్.. ఏది నిజం.. ఏది అబద్ధం అని నమ్మేపరిస్థితి లేకుండా పోయింది. తాజాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. టీషర్ట్ ధరించిఉన్న ఆయన.. ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఓ వినతిపత్రాన్ని అందుకుంటున్నారు.. టీటీడీ ఈవోగా ఉన్న వ్యక్తి సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించకుండా.. టీషర్ట్ ధరించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి.. అయితే, ఆ ఫొటో వెనుక ఉన్న అసలు విషయాన్ని వివరిస్తూ.. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు ఉద్యోగ సంఘాల నేతలు.. కోవిడ్ సమయంలో వైద్య చికిత్సలు అందక, ఆక్సిజన్ సిలిండర్లు దోరకక, ఆస్పత్రుల్లో కనీసం బెడ్‌లు కూడా దోరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు అయిన మేం ఒక రోజు సుమారు రాత్రి 10 గంటల సమయంలో హుటాహుటిన తిరుమలలోని అదనపు కార్యనిర్వాహణాధికారి అయినటువంటి ఏవీ ధర్మారెడ్డి.. క్యాంపు కార్యాలయానికి వెళ్లాం.. సీసీ ద్వారా కబురు పంపడంతో ఆయన హుటాహుటిన కిందకు వచ్చి, యూనియన్ నాయకుల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించారని తెలిపారు.. టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్.. ఇక, రెండేళ్ల క్రితం మేం ఇచ్చిన వినతిపత్రం తీసుకున్నప్పటి చిత్రాన్ని చూపించి.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. దీనిని ఉద్యోగ సంఘ నాయకులుగా మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
62 ఏళ్లలో కేవలం 5 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించింది.. ఎందుకు వెనుకబడిందంటే?
చంద్రునిపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత పాకిస్థాన్ పౌరులే పాక్ అంతరిక్ష సంస్థను ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఆహార కొరత ఉందని, అంతరిక్షంలోకి వెళ్లడం గురించి ఎవరు మాట్లాడతారని ప్రజలు అంటున్నారు. పాక్ ఏజెన్సీ ఇస్రో కంటే ముందే స్థాపించబడిన తర్వాత కూడా ఎందుకు వెనుకబడిందో తెలుసుకుందాం. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అమెరికా, రష్యా, చైనా చేయలేని పనిని భారత్ చేసింది. భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో ఎక్కువగా చంద్రయాన్-3 గురించి చర్చించుకుంటున్నారు. సామాన్యులు అయినా, మీడియా అయినా అందరూ పాకిస్థాన్ పాలకులను తిట్టడంలో బిజీగా ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కంటే ముందే పాకిస్థాన్‌లో అంతరిక్ష సంస్థ స్థాపించబడింది. ఇస్రోతో పోలిస్తే పాక్ అంతరిక్ష సంస్థ ఎక్కడా ఎందుకు నిలబడలేకపోయింది అనే ప్రశ్న చాలా ఎక్కువగా తలెత్తుతోంది.
మాల్‌లో తన భాగస్వామికి ప్రపోజ్.. ఎలా రియాక్ట్ అయిందంటే..!
పెళ్లికి ముందు తనకు కాబోయే భాగస్వామిని ప్రపోజ్ చేయడం చాలా ప్రత్యేకం. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. సోషల్ మీడియాలో ఇలాంటి వాటి కోసం స్పెషల్ వీడియోలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లికి ముందు మాల్ లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. అంతేకాకుండా ఆమేతో ఉన్న తన స్నేహితురాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తనకు కాబోయే భాగస్వామిని ప్రపోజ్ చేయడానికి ఆ వ్యక్తి అదే మాల్‌కు చేరుకున్నాడు. అక్కడ అమ్మాయి తన స్నేహితులతో తిరుగుతుండగా.. వెనుక నుంచి వెళ్లి ఆమే భుజంపై చేయి వేశాడు. ఆ అమ్మాయి వెంటనే వెనక్కి తిరగగానే మోకాళ్లపైకి కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఈ సమయంలో ఆమె స్నేహితులు ఆనందంతో నవ్వుతూ, చప్పట్లు కొడుతున్నారు. మరోవైపు తన భాగస్వామి అలా ప్రపోజ్ చేయడం చూసి ఆ మహిళ.. ఎంతో సంబరపడిపోయింది. వెంటనే తాను తీసుకొచ్చిన రింగ్ తీసి మహిళ వేలుకు పెట్టి పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత మహిళ కూడా ప్రేమగా కాబోయే భర్తను కౌగిలించుకుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో (@pari_sachdeva_) పేరుతో పోస్ట్ చేశారు. ఆగస్టు 17న షేర్ చేసిన వీడియోను.. 84 లక్షల మంది చూశారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మాల్స్ లో ప్రపోజ్ ఏంటీ అని కొందరు అంటుంటే.. చూడటానికి సూపర్ గా ఉందని మరికొందరు రాసుకొచ్చారు.
జర జాగ్రత్త బ్రో.. గొడుగు పట్టుకొని బస్సు నడుపుతున్న డ్రైవర్
వైరల్ అవుతున్న ఓ వీడియోలో డ్రైవర్ గొడుగు పట్టుకొని బస్సు నడుపుతున్నాడు. ఇది మహారాష్ట్రకు చెందిన బస్సు. బస్సు వెళుతున్నప్పుడు వర్షం పడింది. బస్సు పాతది కావడంతో బస్సులోకి అక్కడక్కడ పై నుంచి వాన నీరు కారింది. డ్రైవర్ వద్ద కూడా నీరు లీక్ కావడంతో చేసేది లేక అతను ఒక చేతిలో గొడుగు పట్టుకొని మరో చేతితో స్టీరింగ్ తిప్పుతూ బస్సును నడిపాడు. ఇది చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది. ప్రయాణీకులు కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, బస్సులో ఉన్న అందరి ప్రాణాలు ఆపదలో పడతాయని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మహారాష్ట్ర బస్సుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అది పల్లెటూరికి వెళ్లే బస్సు అందుకే దాని గురించి పట్టించుకోవడం లేదంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది అంబ్రెల్లా డ్రైవింగ్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి డ్రైవింగ్ ప్రమాదకరమని ఇది చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్ దుస్థితిపై ప్రతి ఒక్కరు జాలి చూపిస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అయ్యిండి ఇలా కష్టపడుతున్నాడని , ప్రభుత్వం ఇప్పటికైనా బస్సుల పరిస్థితిని పాటించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవలు.. ఇదే అసలు నిజం
అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీకి విషెస్ తెలుపుతుంది. బన్నీ సైతం.. తనకు విష్ చేసిన వారందరికీ ఎంతో ఓపిగ్గా వారు ఎలా అయితే పెట్టారో.. అలానే రిప్లై ఇచ్చాడు. అయితే .. రామ్ చరణ్ కు మాత్రం కేవలం థాంక్స్ అని రిప్లై ఇవ్వడంతో.. అందరికీ మైడియర్ బ్రదర్.. కజిన్ .. లవ్స్.. అని పెట్టి.. చరణ్ కు మాత్రం ఉత్తిగా థాంక్స్ చెప్పడం ఏంటీ.. వీరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అని రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ పుకార్లకు చెక్ పెట్టాడు బన్నీ. ఉపాసన- చరణ్.. బన్నీకి అవార్డు వచ్చిన వెంటనే .. బొకేతో పాటు కంగ్రాట్స్ నోట్ ను కూడా పంపారట. ఆ పుష్పగుచ్ఛానికి సంబంధించిన ఫోటోను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి చరణ్ – ఉపాసనకు థాంక్స్ చెప్పాడు. ఈ ఒక్క పోస్ట్ తో వారి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేనట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
మలైకా-అర్జున్ కపూర్ బ్రేకప్ నిజమే.. ఇవిగోండి ప్రూఫ్స్!
నిజానికి వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడి అందరికీ షాక్ ఇచ్చిన అర్జున్ కపూర్ -మలైకా అరోరా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో సరికొత్త ప్రచారం జరుగుటఁది. ఆ దెబ్బకు సోషల్ మీడియాలో సైతం వీరిద్దరి బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇద్దరూ అధికారికంగా ఏమీ మాట్లాడలేదు కానీ మలైకా తన సోషల్ మీడియాలో చేసిన కొన్ని పనులు ఇప్పుడు వీరి బ్రేకప్ నిజమేనేమో అనేలా చేస్తునున్నాయి. ఒకరకంగా ఆమె చేసిన పని ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. మలైకా – అర్జున్ కపూర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీకేషన్స్ మొదలు చాలా ఈవెంట్‌ల వరకు ఇద్దరూ కలిసి వెళ్తూ మీడియా కంటికి కనిపించేవారు. ముందు జనం కొంత వీరి బంధం గురించి కామెంట్ చేసినా ఇప్పుడు ఆరు కూడా అలవాటు పడ్డారు. ఐదు సంవత్సరాలకు పైగా వీరి బంధం ఉండడంతో త్వరలో పెళ్లి కూడా జరగనుందనే వార్త సైతం తెరపైకి వచ్చింది. అర్జున్, మలైకా పెళ్లి కూడా జరుగుతుందని అందరూ భావిస్తున్న ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏదీ సరిగా లేదనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ కుటుంబాన్ని అన్‌ఫాలో చేసింది. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, మలైకా అర్జున్ కపూర్ సోదరీమణులు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లను ముందు వరకు ఇన్‌స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండే మలైకా ఇప్పుడు అన్‌ఫాలో చేసింది. అంతేకాదు అన్షులా కపూర్, బోనీ కపూర్ లను కూడా ఆమె అన్ ఫాలో అయింది. అయితే ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే అర్జున్ కపూర్ ఫ్యామిలీ మొత్తాన్ని అన్ ఫాలో చేసినా ఇప్పటికీ, అర్జున్ కపూర్‌ను ఫాలో ఆవుతోన్నది. ఇక ఇటీవల, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుషా కపిల అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక తన ఎఫైర్ వార్తలపై ఆమె మౌనం వీడుతూ “ నా గురించి చాలా అర్ధంలేని విషయాలు చదివిన తర్వాత, నన్ను నేను అధికారికంగా పరిచయం చేసుకోవాలి, నా గురించి ఎప్పుడూ లేనిపోని మాటలు వింటూనే ఉంటాను, కేవలం మా అమ్మ ఇవన్నీ చదవకూడదు అని ఆమె చెప్పుకొచ్చింది.